మరుమల్లెల్లో
అమృత (2002)
సాహిత్యం:వేటూరి
సంగీతం, గానం: రెహమాన్
మరు మల్లెల్లో ఈ జగమంతా విరియగా
ప్రతి ఉదయంలో శాంతి కోసమే తపనగా
బాణాలేదో భూమికి మెరుపుగా
మందారాలే మత్తునూ వదలగా
కనులా తడి తుడిచే వొడిలో పసి పాపాయి
చిలికే చిరు నగవే చీకటితల్లికి వేకువా
మరుమల్లెల్లో ఈ జగమంతా విరియగా
ప్రతి ఉదయంలో శాంతి కోసమే తపనగా
బాణాలేదో భూమికి మెరుపుగా
మందారాలే మత్తునూ వదలగా
కనులా తడి తుడిచే వొడిలో పసిపాపాయి
చిలికే చిరునగవే చీకటితల్లికి వేకువా
మరుమల్లెల్లో ఈ జగమంతా విరియగా
గాలి పాటలా
జడివాన జావళీ
అది మౌనంలా దూరం అవునా
వేల మాటలే వివరించలేనిది
తడి కన్నుల్ల అర్దం అవునా
మరు మల్లెలో ఈ జగమంతా విరియగా విరియగా
ప్రతి ఉదయంలో శాంతి కోసమే తపనగా తపనగా
బాణాలేదో భూమికి మెరుపుగా
మందారాలే మత్తునూ వదలగా
మరు మల్లెల్లో ఈ జగమంతా విరియగా విరియగా
ప్రతి ఉదయంలో శాంతి కోసమే తపనగా తపనగా
లేతపాపలా చిరునవ్వు తోటకే
దిగి వస్తావా సిరులా వెన్నెలా
వీర భూమిలో సవరాలు మారితే
వినిపించే నా స్వరమే కోయిలా
మరు మల్లెల్లో ఈ జగమంతా విరియగా
ప్రతి ఉదయంలో శాంతి కోసమే తపనగా
బాణాలేదో భూమికి మెరుపుగా
మందారాలే మత్తునూ వదలగా
మరు మల్లెల్లో ఈ జగమంతా విరియగా విరియగా
ప్రతి ఉదయంలో శాంతి కోసమే తపనగా తపనగా