సిక్కేవులేరా
రాజనందిని (1958)
సంగీతం: టి.వి.రాజు
గానం: జిక్కి, పిఠాపురం
రచన: మల్లాది
పల్లవి:
సిక్కేవులేరా సక్కని రాజా
సినదాని సేతికి నీవూ
సిలక లాగా
సిక్కేవులేరా సక్కని రాజా
సినదాని సేతికి నీవూ
సిలక లాగా
కళ్ళల్లో సిక్కాలల్లి కమ్ముకురానా
దారుల్లో ఒంటిగ చేసి దోచుకుపోనా
కళ్ళల్లో సిక్కాలల్లి (చిట్కాలల్లి) కమ్ముకురానా
దారుల్లో ఒంటిగ చేసి దోచుకుపోనా
జంతరివైతే మంతరముంటే
సిక్కేనే సివంగి కూనా
నాకంతె శాన
కాదంటే మాన
నాకంతె శాన
కాదంటే మాన
సై అంటే సయ్యేరా
సై...తస్సల రవల
సిక్కేవులేరా సక్కని రాజా
సినదాని సేతికి నీవూ
సిలక లాగా
చరణం 1:
నిన్ను సూసినార
నీకన్నా ఎత్తరి దాన్నిరా
సిన్నెలు సూసుకోరా
నీకన్నా బిత్తరి దాన్నిరా
ఏలాకోలం కాదురా
ఎచ్చని ఎచ్చని ఊసురా
యేలాకోలం కాదురా
ఎచ్చని ఎచ్చని ఊసురా
రేయికి రేయి నీవూ నేనూ
ఎన్నెల్లో సికారురా
ఎన్నెల్లో సికారురా
సెకసెకలాడే పకపకలాడే
సిందేసే సివంగి కూన
నాకంతె శాన
కాదంటే మాన
నాకంతె శాన
కాదంటే మాన
సై అంటే సయ్యేరా
సై...తస్సల రవల
సిక్కేవులేరా సక్కని రాజా
సినదాని సేతికి నీవూ
సిలక లాగా
చరణం 2:
కోనల్లో నీడుండాది తోడుండాదిరా
వేటాడే సింగం కూనా వెంటుండాదిరా
కోనల్లో నీడుండాది తోడుండాదిరా
వేటాడే సింగం కూనా వెంటుండాదిరా
హా! ఎంట ఎంటగా కొంటెగ జంటగ
ఉందామె సివంగికూనా
నాకంతె శాన
కాదంటే మాన
నాకంతె శాన
కాదంటే మాన
సై అంటే సయ్యేరా
సై...తస్సల రవల
సిక్కేవులేరా సక్కని రాజా
సినదాని సేతికి నీవూ
సిలక లాగా