ఝల్లుమనదా
చిత్రం: మొదటి సినిమా (2005)
సంగీతం: స్వరాజ్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బి చరణ్, సునీత
ఝల్లుమనదా హృదయం
త్రుళ్ళిపడదా సమయం
నమ్మగలదా నయనం నయగారమా
నువ్వేనా నువ్వనుకున్నానా
నిజమేనా ఊహలో ఉన్నానా
ఝల్లుమనదా హృదయం
త్రుళ్ళిపడదా సమయం
నమ్మగలదా నయనం నయగారమా
నువ్వేనా నువ్వనుకున్నానా
నిజమేనా ఊహలో ఉన్నానా
ఐతే నాకోసం నువ్వొక కవిత చెప్పు
ఏ కవిత చెప్పను
ఆ స్వరము నువ్వై - హ హ తరువాత
స్వరమున పదము నువ్వై - హ హ
రాగం గీతం కాదా
ఇది ఆకలి రాజ్యం కాదా హ హ
ఎన్నివేల కలవరింతలొ విన్నవించుకున్నాక
నన్నివేళ పగటికాంతిలొ కలుసుకుంది శశిరేఖా
ఎన్నివేల కలవరింతలొ విన్నవించు కున్నాక
నన్నివేళ పగటికాంతిలొ కలుసుకుంది శశిరేఖా
ఈ సత్యం స్వప్నంలా కరిగేదాకా
మైమరుపే ఆపాలా నిద్దుర రాదా
సందేహం పోతుందేమో
నన్ను నేను గిల్లి చూసుకుంటే
ఆశలెపుడు హంసలేఖలై ఆమెదాక చేరాయో
కాంక్షలెపుడు కుంచె కుదుపులై ఆమె లాగ మారాయో
ఆశలెపుడు హంసలేఖలై ఆమెదాక చేరాయో
కాంక్షలెపుడు కుంచె కుదుపులై ఆమె లాగ మారాయో
చెలి శిల్పం మలిచింది మనసే ఐనా
ఇంతందం తెలిసిందా తనకెపుడైనా
తలపంతా తలవంచింది
కళ్ళముందు ఆమె వచ్చి ఉంటే
ఝల్లుమనదా హృదయం
త్రుళ్ళిపడదా సమయం
నమ్మగలదా నయనం నయగారమా
నువ్వేనా నువ్వనుకున్నానా
నిజమేనా ఊహలో ఉన్నానా