పాపం... ప్రియుడి లావు గురించి
ప్రియురాలి వ్యంగమయిన వర్ణన
గుత్తీ వంకాయ్
డ్యూయెట్ (1994)
చిత్ర
రెహమాన్
భువనచంద్ర
పల్లవి:
ప్రియురాలి వ్యంగమయిన వర్ణన
గుత్తీ వంకాయ్
డ్యూయెట్ (1994)
చిత్ర
రెహమాన్
భువనచంద్ర
పల్లవి:
గుత్తీ వంకాయ్
గుత్తీ వంకాయ్
గుండు గుత్తొంకాయ్
చెక్కిళ్ళనే గిల్లీ చూస్తే
లేత బెండకాయ్
ఏ అంగట్లో బియ్యం
నువ్వు కొనేదీ?
నీ అందం నా ఎద
దోచుకున్నది
గుమ్మ నీ ఒడిన పడ్డది పడ్డది
పుచ్చుకుంటే మనసున్నది ఉన్నది
అందుకే
నిన్నే మోజుపడ్డది
గుత్తీ వంకాయ్
గుత్తీ వంకాయ్
గుండు గుత్తొంకాయ్
చెక్కిళ్ళనే గిల్లీ చూస్తే
లేత బెండకాయ్
చరణం 1:
బరువెంతో చూడాలంటు
మిషనెక్కి కాయిన్ వేస్తే
గుంపుగా ఎక్కొద్దంటు
చీటీ వచ్చిందా?
ఇంగ్లాండు వెళ్ళేముందు
ఏరోప్లేనెక్కే ముందు
టిక్కెట్లు రెండు
కొనమని నోటీసొచ్చిందా
పిప్పళ్ళ బస్తాలా
ఉన్నావోయ్ మావయ్యో
నీ సైజు పిల్లే అసలు
దొరికేనా ఓరయ్యో
పెళ్ళయితే పందిరిమంచం
విరిగేనేమో చూస్కోవయ్యో
చరణం 2:
గున్నేనుగు బాడీ తోటి
గుర్రం పై స్వారీ చేస్తే
గుర్రం నీ బరువుకి
పాపం చచ్చిందన్నారే
రోడ్డంటా వెళుతూ ఉంటే
భూమదిరి పోయిందంటూ
ఊరంతా వాగుతారు
పోవద్దు రోడ్లో
కోరి కోరి నిన్నిట్టా
చూస్తేనే ముద్దంటా
నున్నగున్న ఈ ఒళ్ళే
డన్ లప్పు బెడ్డంట
మంచానికి పరుపే వద్దు
గుండెలపైనే పడుకుంటా
గుత్తీ వంకాయ్
గుత్తీ వంకాయ్
గుండు గుత్తొంకాయ్
చెక్కిళ్ళనే గిల్లీ చూస్తే
లేత బెండకాయ్
ఏ అంగట్లో బియ్యం
నువ్వు కొనేదీ?
నీ అందం నా ఎద
దోచుకున్నది
గుమ్మ నీ ఒడిన పడ్డది పడ్డది
పుచ్చుకుంటే మనసున్నది ఉన్నది
అందుకే
నిన్నే మోజుపడ్డది
గుత్తీ వంకాయ్
గుత్తీ వంకాయ్