దాశరథీ కరుణా పయోనిధి

దాశరథీ కరుణా పయోనిధి
శ్రీ రామదాసు (2006)
కీరవాణి
బాలు, చిత్ర
వేదవ్యాస

దాశరథీ కరుణా పయోనిధి
నువ్వే దిక్కని నమ్మడమా
నీ అలయమును నిర్మించడమా
నిరతము నిను భజియించడమా
రామకోటి రచియించడమా
సీతా రామస్వామి నే చేసిన నేరమదేమి
నీ దయ చూపవదేమి నీ దర్శన మీయవిదేమి
దాశరథీ కరుణా పయోనిధి

గుహుడు నీకు చుట్టమా  గుండెలకు హత్తుకున్నావు
శబరి నీకు తొబుట్టువా  ఎంగిలి పళ్ళను తిన్నావు
నీ రాజ్యము రాసిమ్మంటినా  నీ దర్శనమే  ఇమ్మంటిని కానీ
ఏల రావు నన్నేలరావు నన్నేల ఏల రావు
సీతారామస్వామి నే చేసిన నేరమదేమి
నీ దయ చూపవదేమి నీ దర్శన మీయవిదేమి
దాశరథీ కరుణా పయోనిధి

రామ రసరమ్య ధామ, రమణీయ నామ
రఘువంశ  సోమ ,రణరంగ భీమ
రాక్షస విరామ
కమనీయ ధామ  సౌందర్య సీమ
నీరజశ్యామ నిజబుజోద్దామ
భూజనులరామ భువన జయ రామ పాహి భద్రాద్రి రామ పాహీ

తక్షణ రక్షణ విశ్వవిలక్షణ ధర్మవిచక్షణ
గోదారి కలిసెనేమిరా డాండ డ డాండ డాండ నినదమ్ముల
జాండము నిండ మత్తవేదండము నెక్కి నే పొగడు నీ అభయవ్రతమేదిరా
ప్రేమ రసాంతరంగ హృదయంగమ
సింగశుభంగ రంగ బహురంగద
భంగ తుంగ సుగుణైకతరంగ
శుసంగ సత్య సారంగ సుసృతివిహంగ
పాప మృదుసంగ విభంగా
భూతల పతంగ మధుమంగళరూపము చూపవేమిరా
గరుడగమన రా రా గరుడగమన రా రా