Showing posts with label శ్రీ రామదాసు (2006). Show all posts
Showing posts with label శ్రీ రామదాసు (2006). Show all posts

శుద్దబ్రహ్మ పరాత్పర రామా

శుద్దబ్రహ్మ పరాత్పర రామా
శ్రీ రామదాసు (2006)
కీరవాణి
ప్రణవి

శుద్దబ్రహ్మ పరాత్పర రామా..కాలాత్మక పరమేశ్వర రామా
శుద్దబ్రహ్మ పరాత్పర రామా..కాలాత్మక పరమేశ్వర రామా

శేషతల్ప సుఖ నిద్రిత రామా ..బ్రహ్మాద్యమరా ప్రార్ధిత రామా
శేషతల్ప సుఖ నిద్రిత రామా ..బ్రహ్మాద్యమరా ప్రార్ధిత రామా

రామ రామ జయ రాజా రామా..రామ రామ జయ సీతారామా
రామ రామ జయ రాజా రామా..రామ రామ జయ సీతారామా

ప్రియ గుహ వినివేదిత పద రామా..శబరీ దత్త ఫలాశన రామా
ప్రియ గుహ వినివేదిత పద రామా..శబరీ దత్త ఫలాశన రామా

హనుమత్సేవిత నిజపద రామా..సీతా ప్రాణాధారక రామా
రామ రామ జయ రాజా రామా..రామ రామ జయ సీతారామా
రామ రామ జయ రాజా రామా..రామ రామ జయ సీతారామా

శుద్దబ్రహ్మ పరాత్పర రామా..కాలాత్మక పరమేశ్వర రామా
శుద్దబ్రహ్మ పరాత్పర రామా..కాలాత్మక పరమేశ్వర రామా

ఇదిగిదిగో నా రాముడు

ఇదిగిదిగో నా రాముడు
శ్రీ రామదాసు (2006)
కీరవాణి
సునీత
భారవి

ఇదిగిదిగో నా రాముడు ఈడనే కొలువుండినాడు
ముద్దుల సీతతో ఈడనే మురిపాలాడినాడు

ఇది సీతమ్మ తల్లి ఆరేసుకున్న నార చీరె
ఇదె రాముడు కట్టుకొనగ పులకించిన పంచె
ఏడేడు లోకాలను ఏలెడి పాదాలివే
మాయల బంగారు లేడి మాయని గురుతులివే

పచ్చగ అయిదోతనమే పదికాలాలుండగా
సీతమ్మ వాడిన పసుపుకుంకుమ రాళ్ళివే
దాటొద్దని లక్ష్మణుడు గీతను గీసిన చోటిదే
అమ్మను రావణుడెత్తుకుపోయిన ఆనవాళ్ళివే

ఇది ఆ రాముడు నడయాడిన పుణ్యభూమి
మరి నా రామునికీడ నిలువనీడ లేదిదేమి
నిలువ నీడ లేదిదేమి

ఇక్ష్వాకు కుల తిలకా

ఇక్ష్వాకు కుల తిలకా ఇకనైన పలుకవే
శ్రీ రామదాసు (2006)
కీరవాణి
శంకర్ మహదేవన్

ఇక్ష్వాకు కుల తిలకా ఇకనైన పలుకవే
రామచంద్రా నను రక్షింపకున్నను రక్షకులు ఎవరింక రామచంద్రా

చుట్టు ప్రాకారములు సొంపుతో గట్టిస్తి రామచంద్రా
ఆ ప్రాకారముకు బట్టె పదివేల వరహాలు రామంచంద్రా
లక్ష్మణుకు చేయిస్తి ముత్యాల పతకము రామచంద్రా
ఆ పతకానికీ బట్టె పదివేల మొహరీలు రామచంద్రా
సీతమ్మకూ చేయిస్తినీ చింతాకు పతకము రామచంద్రా
ఆ పతకానికీ బట్టె పదివేల వరహాలు రామచంద్రా
కలికి తురాయి నీకు కొలుపుగా జేయిస్తినీ రామచంద్రా

నీ తండ్రి దశరధ మహరాజు పంపెనా
లేక నీ మామ జనక మహరాజు పెట్టెనా
ఎవడబ్బ సొమ్మనీ కులుకుతూ తిరిగేవు రామచంద్రా
ఎవడబ్బ సొమ్మనీ కులుకుతూ తిరిగేవు రామచంద్రా

రామా శ్రీరామా కోదండ రామా

రామా శ్రీరామా కోదండ రామా
శ్రీ రామదాసు (2006)
కీరవాణి
బాలు

రామా శ్రీరామా కోదండ రామా
ఎంతో రుచిరా ఎంతో రుచిరా
శ్రీరామ ఓ రామ శ్రీరామ
శ్రీరామ నీనామమెంతో రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
ఓ రామ నీ నామమెంతో రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా

కదళీ ఖర్జూరాది ఫలముల కన్నను
కదళి ఖర్జూరాది ఫలముల కన్నను
పతిత పావన నామ మేమి రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
నవసర పరమాన్న నవనీతముల కన్న
అధికమౌ నీ నామమేమి రుచిరా
శ్రీరామ అహ శ్రీరామ
ఓ రామ ఓ రామ
శ్రీరామ నీ నామమెంతో రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా

సదాశివుడు నిను సదా భజించెడి
సదానంద నీ నామ మేమి రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
అరయ భద్రాచల శ్రీరామదాసుని
ఏలిన నీ నామ మేమి రుచిరా
శ్రీరామ ఓ రామ
శ్రీరామ నీ నామమెంతో రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
ఓ రామ నీ నామమెంతో రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
శ్రీరామ నీనామమెంతో రుచిరా
ఎంతో రుచిరా

చరణములే నమ్మితీ నీ దివ్య చరణములే నమ్మితీ

చరణములే నమ్మితీ నీ దివ్య చరణములే నమ్మితీ
శ్రీ రామదాసు (2006)
కీరవాణి
చిత్ర, విజయ్ ఏసుదాస్

చరణములే నమ్మితీ నీ దివ్య చరణములే నమ్మితీ
చరణములే నమ్మితీ నీ దివ్య చరణములే నమ్మితీ
చరణములే నమ్మితీ
వారధి కట్టిన వరభద్రాచల వరదా వరదా వరదా
నీ దివ్య చరణములే నమ్మితీ
చరణములే నమ్మితీ

పావన రామ నామసుధారస పానము చేసేదెన్నటికో
సేవించియు శ్రీహరి పాదంబులు చిత్తమునుంచేదెన్నటికో
రామ రామ జయ సీతారామా రఘుకులసోమ రణభీమా
రామ రామ జయ సీతారామా జగదభిరామా జయరామా

చంచలగుణములు మాని సదా నిశ్చల మదియుండేదెన్నటికో
పంచతత్వములు తారకనామము పఠియించుట నాకెన్నటికో
రామ రామ జయ సీతారామా రఘుకులసోమ రణభీమా
రామ రామ జయ సీతారామా జగదభిరామా జయరామా

నందబాలం భజరే నందబాలం
బృందావన వాసుదేవ బృందలోలం
నందబాలం భజరే నందబాలం
బృందావన వాసుదేవ బృందలోలం
జలజ సంభవాది వినుతా
జలజ సంభవాది వినుతా
జలజ సంభవాది వినుతా
జలజ సంభవాది వినుతా
జలజ సంభవాది వినుతా
చరణారవిందం కృష్ణ లలితా మోహన రాధ వదనా నళినా మిళిందం
నందబాలం భజరే నందబాలం
బృందావన వాసుదేవ బృందలోలం
నందబాలం భజరే నందబాలం
బృందావన వాసుదేవ బృందలోలం

శ్రీరామ నామం మరువాం మరువాం
సిద్దము యమునికి వెరువాం వెరువాం
శ్రీరామ నామం మరువాం మరువాం
సిద్దము యమునికి వెరువాం వెరువాం
గోవిందునీవేళ కొలుతాం కొలుతాం
గోవిందునీవేళ కొలుతాం కొలుతాం
దేవుని గుణములు తలుతాం తలుతాం
దేవుని గుణములు తలుతాం తలుతాం
శ్రీరామ నామం మరువాం మరువాం
సిద్దము యమునికి వెరువాం వెరువాం
విష్ణు కధలు చెవుల విందాం విందాం
విష్ణు కధలు చెవుల విందాం విందాం
వేరు కధలు చెవిన మాందాం మాందాం
వేరు కధలు చెవిన మాందాం మాందాం
శ్రీరామ నామం మరువాం మరువాం
సిద్దము యమునికి వెరువాం వెరువాం

హే జై జై రామ జానకి రామ
జై జై రామ జానకి రామ
పావన నామ పట్టాభి రామ
పావన నామ పట్టాభి రామ
నిత్యము నిన్నే కొలిచెద రామ
అహ నిత్యము నిన్నే కొలిచెద రామ
ఆహా రామా అయోధ్య రామ
ఆహా రామా అయోధ్య రామ
రామా రామా రఘుకుల సోమా
అహ రామా రామా రఘుకులసోమా
జై జై రామ జానకిరామ
జై జై రామ జానకిరామ
జై జై రామ జానకిరామ
జై జై రామ జానకిరామ
జై జై రామ జానకిరామ
జై జై రామ జానకిరామ
జై జై రామ జానకిరామ
జై జై రామ జానకిరామ

అంతా రామమయం

అంతా రామమయం ఈ జగమంతా రామమయం
శ్రీ రామదాసు (2006)
కీరవాణి
బాలు

అంతా రామమయం ఈ జగమంతా రామమయం
అంతా రామమయం ఈ జగమంతా రామమయం
అంతా రామమయం ఈ జగమంతా రామమయం
అంతా రామమయం

అంతరంగమున అత్మారాముడు
రామ రామ రామ రామ
అనంత రూపముల వింతలు సలుపగ
రామ రామ రామ రామ
సోమ సూర్యులును సురలు తారలును
ఆ మహాంబుధులు అవనీజంబులు

అంతా రామమయం ఈ జగమంతా రామమయం
అంతా రామమయం

ఓం నమో నారాయణాయ,ఓం నమో నారాయణాయ,ఓం నమో నారాయణాయ

అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగ
నదులు వనంబులు నానామృగములు పీత కర్మములు వేద శాస్త్రములు
అంతా రామమయం ఈ జగమంతా రామమయం

రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ
సిరికిన్ జెప్పడు శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడు
ఏ పరివారంబును జీరడు అభ్రకపతిన్ బంధింపడు
ఆకర్ణికాంతర ధన్ విల్లము చక్క నొక్కడు
నివాదప్రోద్ధీత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు
గజప్రాణావనోత్సాహియై

రామచంద్ర పరబ్రహ్మణి నమహ

ఓం ఓం శ్రి రామచంద్ర పరబ్రహ్మణి నమహ
శ్రీ రామదాసు (2006)
కీరవాణి
బాలు
వేటూరి

ఓం ఓం శ్రి రామచంద్ర పరబ్రహ్మణి నమహ
అదిగొ అదిగొ భద్రగిరి,
అంధ్ర జాతికిది అయొధ్యాపురి
ఎ వాల్మికి రాయని కదగా,
సిత రాములు తనపై ఒదగ
రామదస క్రుత రామ పదామ్రుత
ఆకెయస్వర సంపదగా,
వెలసిన దక్షిన సాంకెతపురి
అదిగొ అదిగొ భద్రగిరి
అంధ్ర జాతికిది అయొధ్యాపురి

రాం రాం రాం రాం
రామ నామ జీవనని నిర్త్రుడు
పునర్దర్శనము కొరిన భక్తుడు
సిత రాముల దర్శనానికై
ఘొరతపస్సును చెసినప్పుడు
తపమును మెచ్చి, ధరణికి వచ్చి
దర్శనమిచెను మహా విష్నువు.

స స స ని ద ని స ని ద ని గ మ ప ద ని ద ని మ ప

త్రెతా యుగమున రామ రూపమె
త్రికరన సుద్దిగ కొరెను భద్రుడు
ఆదర్శాలకు ఆగ్రపీటమౌ
ఆ డర్శనమె కొరెనప్పుడు
ధరణి పతియె దరకు అల్లుడై
శంక చక్రములు అటు ఇతు కాగ
ధనుర్ బాణములు తనువై ఫొగా
సితా లక్ష్మణ సమితుడై
కొలువు తీరె కొండంత దెవుడు
శిలగా మళ్ళి మలచి,
శిరము నీవె నిలచి
భద్రగిరిగ నను పిలిచె
భాగ్యమునిమ్మని కొరె భద్రుదు

వామాంక స్తిత జానకి పరిలస కొదండ దందం కరె,
చక్రం షొర్బ కరెన బాహులు గనె, శంకం శరం దక్షిణె,
విబ్రాణం జల జాత పాత్ర నయనం భద్రాద్రి ముర్తిస్టితం,
వెయురది విడుర్తితం రఘుపతిం, సౌమిత్రి యుక్తం భజెహ్.

దాశరథీ కరుణా పయోనిధి

దాశరథీ కరుణా పయోనిధి
శ్రీ రామదాసు (2006)
కీరవాణి
బాలు, చిత్ర
వేదవ్యాస

దాశరథీ కరుణా పయోనిధి
నువ్వే దిక్కని నమ్మడమా
నీ అలయమును నిర్మించడమా
నిరతము నిను భజియించడమా
రామకోటి రచియించడమా
సీతా రామస్వామి నే చేసిన నేరమదేమి
నీ దయ చూపవదేమి నీ దర్శన మీయవిదేమి
దాశరథీ కరుణా పయోనిధి

గుహుడు నీకు చుట్టమా  గుండెలకు హత్తుకున్నావు
శబరి నీకు తొబుట్టువా  ఎంగిలి పళ్ళను తిన్నావు
నీ రాజ్యము రాసిమ్మంటినా  నీ దర్శనమే  ఇమ్మంటిని కానీ
ఏల రావు నన్నేలరావు నన్నేల ఏల రావు
సీతారామస్వామి నే చేసిన నేరమదేమి
నీ దయ చూపవదేమి నీ దర్శన మీయవిదేమి
దాశరథీ కరుణా పయోనిధి

రామ రసరమ్య ధామ, రమణీయ నామ
రఘువంశ  సోమ ,రణరంగ భీమ
రాక్షస విరామ
కమనీయ ధామ  సౌందర్య సీమ
నీరజశ్యామ నిజబుజోద్దామ
భూజనులరామ భువన జయ రామ పాహి భద్రాద్రి రామ పాహీ

తక్షణ రక్షణ విశ్వవిలక్షణ ధర్మవిచక్షణ
గోదారి కలిసెనేమిరా డాండ డ డాండ డాండ నినదమ్ముల
జాండము నిండ మత్తవేదండము నెక్కి నే పొగడు నీ అభయవ్రతమేదిరా
ప్రేమ రసాంతరంగ హృదయంగమ
సింగశుభంగ రంగ బహురంగద
భంగ తుంగ సుగుణైకతరంగ
శుసంగ సత్య సారంగ సుసృతివిహంగ
పాప మృదుసంగ విభంగా
భూతల పతంగ మధుమంగళరూపము చూపవేమిరా
గరుడగమన రా రా గరుడగమన రా రా