కోడి బాయె లచ్చమ్మది

కోడి బాయె లచ్చమ్మది

ఎడ్లు బాయె గొడ్లు బాయె ఎలమ దొరల మంద బాయె
గొడ్లు కమ్మ నేను పోతే కందీరీగ కరచిపాయే
అరె...రె....రె
కోడి బాయె లచ్చమ్మది కోడి పుంజు బాయె లచ్చమ్మది
కోడి బాయె లచ్చమ్మది కోడి పుంజు బాయె లచ్చమ్మది

బండి బాయె బస్సు బాయె రేణిగుంట రైలు బాయె
మళ్ళి తిరగ చూడబోతే గాలి మోటారెల్లిపాయే
అరె...రె....రె
దూడబాయె లచ్చమ్మది లేగ దూడ బాయె లచ్చమ్మది

కొండ బాటనొస్తుంటే కోయిలమ్మ కూస్తుంటే
వాగు బాటనొస్తుంటే వాయిలాల చప్పుడాయే
మందనంత  గెదుముకుంటు ఇంటిదారినొస్తంటే
అరె...రె....రె
పోతు బాయె లచ్చమ్మది మేకపోతు బాయె లచ్చమ్మది

లచ్చన్నదారిలోనా లంబాడి లాటలాయే
జిగులాడి సంతలోన పోతలింగడి ఆటలాయే
గట్టు బాయె బుట్ట బాయె ఎలమ దొరల మంద బాయె
బంతి పూలు తెంపబోతే తుమ్మెదొచ్చి కరచిపోయే
గంప బాయె లచ్చమ్మది పూలగంప బాయె లచ్చమ్మది

ఎడ్లు బాయె గొడ్లు బాయె ఎలమ దొరల మంద బాయె
గొడ్లు కమ్మ నేను పోతే కందీరీగ కరచిపాయే
అరె...రె....రె
కోడి బాయె లచ్చమ్మది కోడి పుంజు బాయె లచ్చమ్మది
కోడి బాయె లచ్చమ్మది కోడి పుంజు బాయె లచ్చమ్మది