మందులోడో ఓరి మాయలోడా
గానం: మునెయ్య, స్వర్ణలత
సంగీతం: జి. ఆనంద్
మందులోడో ఓరి మాయలోడా మామ రారా గోగు తిన్నవాడా
మందులోడో ఓరి మాయలోడా మామ రారా గోగు తిన్నవాడా
మాటిమాటికి నన్ను మాటిమాటికి నన్ను మందులోడంటావు
మందులోడన్న సంగతి ముందెరిక లేదా
రాములమ్మో రాములమ్మో రమణి ముద్దుల గుమ్మా
మందులోడో ఓరి మాయలోడా మామ రారా గోగు తిన్నవాడా
మందులోడో ఓరి మాయలోడా మామ రారా గోగు తిన్నవాడా
గుండె నేప్యానినేను గుండె నేప్యానినేను గుమ్మములో కూకుంటే
గుమ్మడాకు పసరు రాసి గుణమే మార్చావురో
కడుపునొప్పాని నేను కడుపునొప్పాని నేను కల్లములో కూకుంటే (కల్లము=మంచము)
కరెంటు తెచ్చి నా కళ్ల కేసావురా
రాళ్ళ నెక్లేసు నేను రాళ్ళ నెక్లేసు నేను పెట్టేటి పిల్లను నా
రాగి ఉంగరాల రాత రాసావుర మామో
పట్టు దొర చీరను నే పట్టు దొర చీరను నే కట్టేటి పిల్లను నా
పాకీ చీరల రాత రాసావుర మామో