December 23, 2019

ఊ అంది పిల్లా


ఊ అంది పిల్లా
గోకులంలో సీత (1997)
సిరివెన్నెల
కోటి
స్వర్ణలత, మురళీధర్

ఊ అంది పిల్లా అల్లో మల్లేశా
తెల్లారేకల్లా పెళ్ళే పరమేశా
వేవేల ఆశలతో వస్తుంది పూబాల
మెళ్ళోన మురిపెంగా వేస్తుంది వరమాల
హో ఊ అంది పిల్లా అల్లో మల్లేశా
తెల్లారేకల్లా పెళ్ళే పరమేశా

ఎల్లోరా శిల్పమల్లే నువ్వు కూర్చుంటే
నిండుగా నేను చూస్తుంటే...
ఉప్పొంగే ఊహలేవో వెన్ను తడుతుంటే
ఎదే బరువెక్కిపోతుంటే...
శుభమంత్రాలే వినబడుతుంటే
పచ్చని తాళి నువ్వు కడుతుంటే.
ఎన్నెన్నో జన్మలబంధం నిన్ను నన్ను ఏకం చేస్తుంటే...
ఊ అంది పిల్లా అల్లో మల్లేశా
ఓ... నీ నీడ నేనై ఉంటా పరమేశా

క్రీగంటి చూపుతో నే సైగ చేస్తుంటే
నువ్వేమో సిగ్గు పడుతుంటే...
నాపైన వెచ్చగా నువ్ వాలిపోతుంటే
ఒళ్ళంతా కాగిపోతుంటే.
మల్లెలమంచం ఒణికేస్తుంటే
వెన్నెలరేయి వరదౌతుంటే
తమకంతో జారే పైట రారమ్మంటూ కవ్విచేస్తుంటే...

ఊ అంది పిల్లా అల్లో మల్లేశా
ఓ... పరువాల దాహం తీర్చేయ్ పరమేశా
కవ్వించు అందాలు కళ్ళార చూడాల
కౌగిళ్ళజాతరలో తెల్లారిపోవాల
ఊ అంది పిల్లా అల్లో మల్లేశా
లాలాల లాలా లాలా లాలా