ఊహలేవో రేగే
చిత్రం: అంతం (1992)
సంగీతం: ఆర్.డి. బర్మన్, మణిశర్మ
గీతరచయిత: సిరివెన్నెల
నేపధ్య గానం: మనో, కవితాకృష్ణమూర్తి
పల్లవి:
హే...ఊహలేవో రేగే..
ఊహలేవోరేగే ఊపుతో ననులాగే
వేడిసెగలై సాగే చిలిపి చలిచెలరేగే
ఆదుకోవా అయిన దాన్నేగా
పూలతీగై ఊగే లేతసైగేలాగే
హాయికథ కొనసాగే రేయిపగలు ఇలాగే
అందుకోవా ఆశేతీరగా
ఊహలేవోరేగే ఊపుతోననులాగే
హాయికథ కొనసాగే రేయిపగలు ఇలాగే