ఒకే తలపు
నాగ మోహిని (1979)
సంగీతం: రాజు
గానం: బాలు, వాణీజయరాం
ఒకే తలపు ఒకటే వలపు
వేచేనురా
ఒకే తలపు ఒకటే వలపు
వేచేనురా
ఒకే పిలుపు నిన్నే కోరి
పాడేనురా
ఒకే తలపు ఒకటే వలపు
వేచేనులే
ఒకే తలపు ఒకటే వలపు
వేచేనులే
ఒకే పిలుపు నిన్నే కోరి
పాడేనులే
ఒకే తలపు ఒకటే వలపు
వేచేనులే
ఒకే తలపు ఒకటే వలపు
వేచేనులే
ఇటు పొరవిడిచి అందాలు
తోచేనులే
అవి పరచేను అనువైన
పాన్పు
నను ఊపించు నీమేని
ఉయ్యాలలూ
అన్ని మరపించు సుఖవీణ మీటీ
దరిచేరవా
నన్నే కూడి నాట్యాలాడి
లాలించవా
ఒకే తలపు ఒకటే వలపు
వేచేనులే
ఒకే తలపు ఒకటే వలపు
వేచేనులే
నను పులకించి చిలికించె
నీ నాదమే
మది ముదమార ఉప్పొంగె
నేడూ
నను పులకించి చిలికించె
నీ నాదమే
మది ముదమార ఉప్పొంగె
నేడూ
నవమోహాల విరహాలు
వెలిగించుదాం
ఈ ప్రణయాన స్వర్గాలు చూడూ
మధుమాసమే
విలాసాల వెన్నెల మనకై
విరిసిందిలే
ఒకే తలపు ఒకటే వలపు
వేచేనురా
ఒకే తలపు ఒకటే వలపు
వేచేనురా