December 26, 2019

తలపుల రాగం


తలపుల రాగం
వద్దంటే పెళ్ళి (1984)
ఇళయరాజా
సుశీల, బాలు

తలపుల రాగం
వలపుల తాళం
తలపుల రాగం
వలపుల తాళం
నీవే నా ప్రాణం
ఇక నీతోనే లోకం
నీవే నా ప్రాణం
ఇక నీతోనే లోకం
తలపుల రాగం

మనసులు పలికెను
మధువులు చిలికెను
సంధ్యవేళ కానుకగా
చెరగని ఊసులు
తరగని బాసలు
చిందులేసే వెన్నెలగా
అలలై కళలూగే
సమయం ఈవేళ
నదిలా కదలాడే
ప్రాయం ఈవేళ
రేగెనులే మన్మధరాగం
పాడేనులే ఆమనికాలం
ఈనాడు ఆనందయోగం

తలపుల రాగం
వలపుల తాళం
నీవే నా ప్రాణం
ఇక నీతోనే లోకం

మమతలు తడిసెను
తలపులు మురిసెను
తొలకరి జల్లులలో
పొంగిన కలలే
పల్లవి పాడెను
వెచ్చని ఊహలలో
వెలిసే దేవలోకం
నాకే నేడు సొంతం
రగిలే రాగబంధం
తెలిపే కొత్తపాఠం
ఆహా ఇదీ మల్లెలమాసం
వచ్చేనులే ప్రేమలకోసం
విడిపోదు మన వింతబంధం

తలపుల రాగం
వలపుల తాళం
నీవే నా ప్రాణం
ఇక నీతోనే లోకం
నీవే నా ప్రాణం
ఇక నీతోనే లోకం