పాడకే నా రాణి
ఈ పాటని రచించినది అడవి బాపిరాజు.
సంగీతం, గానం ఘంటసాల.
నఠభైరవి (హిందూస్తానీ అసావరీ) రాగంలో స్వరపరచబడింది.
తాళం: ఖండచాపు/జంపె (హిందూస్తానీ ఝప్ తాళ్)
పాడకే నా రాణి పాడకే పాట పాట మాధుర్యాల ప్రాణాలు మరిగెనే
రాగమాలాపించి వాగులా ప్రవహించి సుడిచుట్టు గీతాల సురగిపోనీయకే ||
కల్హారముకుళములు కదలినవి పెదవులు ప్రణయపదమంత్రాల బంధించె జీవనము ||
శృతిలేని నామతికి చతురగీతాలేల గతిరాని పాదాల గతుల నృత్యమ్మటే ||