మరవలేనురా
నిన్ను నేను మరవలేనురా
ఓ.... పంచదార వంటి పోలీసెంకటస్వామి
నిన్ను నేనూ మరవలేనురా
ఓయ్... వాలుకన్నులా మువ్వలెంకటస్వామి
నిన్ను నేనూ మరవలేనురా
నీకు వచ్చింది కోరమీసం
నాకు వచ్చింది దోరవయసు
ఇద్దరి మనసూ ఒక్కటైతే
వెనక చింత లేని బ్రతుకే ఎంకటస్వామి
ఓ....పంచదార వంటి పోలీసెంకటస్వామి
నిన్ను నేనూ మరవలేనురా
కన్నూ కన్నూ కలిసిందోయ్
నిన్నూ నన్నూ కలిపిందోయ్
ఈడనున్న నేనేడనున్న
నీనీడనేనోయ్ హోయ్
ఈడనున్న నేనేడనున్న
నీనీడనేనోయ్ హోయ్
పోలీసెంకటస్వామి
నావాడవేనోయ్
పోలీసెంకటస్వామి
నావాడవేనోయ్
పోలీసెంకటస్వామి
సందులేదు మనకు సందమామ తోడు
నిన్ను నేను మరవలేనురా
ఓ.... పంచదార వంటి పోలీసెంకటస్వామి
నిన్ను నేనూ మరవలేనురా
ఓయ్... వాలుకన్నులా మువ్వలెంకటస్వామి
నిన్ను నేనూ మరవలేనురా