December 29, 2019

అమ్మ బ్రహ్మదేవుడో

అమ్మ బ్రహ్మదేవుడో
గోవిందా గోవిందా (1993)
సంగీతం::రాజ్ కోటి
రచన::సిరివెన్నెల 
గానం::బాలు, చిత్ర, మాల్గాడి శుభ

ఉయ్.. టముకెయ్ డుండుండిగా
సందడి సెయ్ తమాషగా అంగరంగ వైభోగంగా
సంబరం వీధుల్లో సేరి శివమెత్తంగా
ఉయ్.. దరువెయి తధినక అడుగెయ్ రా
అదీ లెక్క సామిరంగ సిందాడంగా
శీనయ్యే ఏడుకొండలు దిగి కిందికిరాగా

అమ్మ బ్రహ్మదేవుడో....
కొంప ముంచినావురో....
ఎంత గొప్ప సొగసురో...
యాడ దాచినావురో...
పూల రెక్కలు...
కొన్ని తేనె చుక్కలు
రంగరిస్తివో... 
ఇలా బొమ్మ చేస్తివో
అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా...?
కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా..!

కనురెప్పలు పడనప్పుడు 
కల కళ్ళపడదుగా
కనుకిప్పుడు ఎదరున్నది 
కల్లై పోదుగా...!

కనురెప్పలు పడనప్పుడు 
కల కళ్ళపడదుగా
కనుకిప్పుడు ఎదరున్నది 
కల్లై పోదుగా

ఒకటై సిన్నా పెద్దా అంతా సుట్టూ చేరండి
తకతై ఆటాడించే సోద్యం చూడండి
చంద్రుళ్ళో కుందేలు
సందెల్లో అందాలు
మన ముంగిట్లో కథాకళి ఆడేనా...
అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా
కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా
అమ్మ బ్రహ్మదేవుడో 
అరె కొంప ముంచినావురో
ఎంత గొప్ప సొగసురో 
యాడ దాచినావురో

మహ గొప్పగ మురిపించగ సరికొత్త సంగతి
తలతిప్పగ మనసొప్పక నిలిచే జాబిలి

మహగొప్పగ మురిపించగ సరికొత్త సంగతి
తలతిప్పగ మనసొప్పక నిలిచే జాబిలి

అప్పనా తన్నమన్నా కథం తొక్కే పథానా
తప్పనా తన మన తేడాలేమైనా

తందానా తాళానా కిందైనా మీదైనా
తలవంచేనా తెల్లారులు థిల్లానా

అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా
కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా

అమ్మ బ్రహ్మదేవుడో 
కొంప ముంచినావురో
ఎంత గొప్ప సొగసురో 
యాడ దాచినావురో
పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు
రంగరిస్తివో ఇలా బొమ్మ చేస్తివో
అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా...

ఉయ్.. టముకెయ్ డుండుండిగా
సందడి సెయ్ తమాషగా అంగరంగ వైభోగంగా
సంబరం వీధుల్లో సేరి శివమెత్తంగా
ఉయ్.. దరువెయి తధినక అడుగెయ్ రా
అదీ లెక్క సామిరంగ సిందాడంగా
శీనయ్యా ఏడుకొండలు దిగి కిందికిరాగా...