Showing posts with label గోవిందా గోవిందా (1993). Show all posts
Showing posts with label గోవిందా గోవిందా (1993). Show all posts

అందమా అందుమా అందనంటే అందమా

అందమా అందుమా
చిత్రం: గోవిందా గోవిందా (1993)
సంగీతం: రాజ్-కోటి
గీతరచయిత: సిరివెన్నెల
నేపధ్య గానం: బాలు, చిత్ర

పల్లవి:

అందమా అందుమా 
అందనంటే అందమా
చైత్రమా చేరుమా 
చేరనంటె న్యాయమా

ప్రాణమున్న పైడిబొమ్మ 
పారిజాత పూలకొమ్మ
పరవశాలు పంచవమ్మ 
పాలసంద్రమా

అందమా అందుమా 
అందనంటే అందమా

చైత్రమా చేరుమా 
చేరనంటె న్యాయమా

ప్రాణమున్న పైడిబొమ్మ 
పారిజాత పూలకొమ్మ
పరవశాలు పంచవమ్మ 
పాలసంద్రమా...

ఆడుమా పాడుమా 
మౌనమే మానుకోవమ్మ
అందమా అందుమా 
అందనంటే అందమా

చరణం 1 :

ఆకలుండదే.... దాహముండదే .. 
ఆకతాయి కోరిక,,,
కొరుక్కుతింటదే...
ఆగనంటది దాగనంటది 
ఆకుచాటు వేడుక....
కిరుక్కుమంటది

వన్నెపూల విన్నపాలు విన్నానమ్మి ..
చిటికనేలు యిచ్చి ఏలుకుంటానమ్మి
రాసి పెట్టి ఉందిగనక నిన్నే నమ్మి..
ఊసులన్ని పూసగుచ్చి ఇస్తా సుమ్మి
ఆలనా పాలనా 
చూడగా చేరనా చెంత...

అందమా అందుమా 
అందనంటే అందమా
చైత్రమా చేరుమా 
చేరనంటె  న్యాయమా

చరణం 2 :

వెయ్యి చెప్పినా... లక్ష చెప్పినా 
లక్ష్యపెట్టదే ఎలా...? 
ఇదేమి విలవిలా...
తియ్య తియ్యగా నచ్చ చెప్పని ..
చిచ్చు కొట్టనీ  ఇలా ..
వయ్యారి వెన్నెల

నిలవనీదు నిదరపోదు నారాయణ..
వగల మారి వయసు పోరు నా వల్లనా...
చిలిపి ఆశ చిటికలోన తీర్చేయ్యనా
మంత్రమేసి మంచి చేసి లాలించనా..
ఆదుకో నాయనా... 
ఆర్చవా... తీర్చవా.. చింత

అందమా అందుమా 
అందనంటే అందమా

చైత్రమా చేరుమా 
చేరనంటె న్యాయమా

ప్రాణమున్న పైడిబొమ్మ 
పారిజాత పూలకొమ్మ
పరవశాలు పంచవమ్మ 
పాలసంద్రమా...

ఆడుమా పాడుమా 
మౌనమే మానుకోవమ్మ

ఓ నవీనా..నవీనా..నవీనా

ఓ నవీనా..నవీనా..నవీనా
గోవిందా గోవిందా (1993)
సంగీతం::రాజ్ కోటి
రచన::వేటూరి
గానం::S.P.బాలు,K.S.చిత్ర

పల్లవి::

ఓ నవీనా..నవీనా..నవీనా ఓ ఓ ఓ ఓ ఓ
ఈ జగాన నువ్వేనా హసీనా ఓ ఓ ఓ ఓ ఓ
ఏమి పులకింత ఇది ఎంత గిలిగింత
ఇది ఎంత ఘాటు ప్రేమ తాకిడో

ఓ నవీనా నవీనా నవీనా ఓ ఓ ఓ ఓ ఓ
ఈ జగాన నువ్వేనా హసీనా ఓ ఓ ఓ ఓ ఓ
ఏమి పులకింత ఇది ఎంత గిలిగింత
ఇది ఎంత ఘాటు ప్రేమ తాకిడో
ఓ నవీనా నవీనా నవీనా..ఆ ఆ ఆ

చరణం::1

కోకనైన కాకపోతి కొమ్మచాటు సోకులన్నీ
తడిమే వేడిలో
కౌగిలైన కాకపోతి ఆకలైన అందమంతా
అడిగే వేళలో

నీలోని తడి అందాలు..శృంగార మకరందాలు
నీ తీపి బలవంతాలు దోచేసె నా స్వప్నాలు
వసంతమాడే వయస్సు నీదే
అది తెలిసిన సరసుడు..కలిసిన పురుషుడు జతపడితే

ఓ నవీనా ఆహా హా ఆహాహా..
ఓ నవీనా నవీనా..ఓ ఓ ఓ ఓ ఓ
ఈ జగాన నువ్వేనా హసీనా..ఓ ఓ ఓ ఓ ఓ
ఏమి పులకింత ఇది ఎంత గిలిగింత
ఇది ఎంత ఘాటు ప్రేమ తాకిడో

చరణం::2

ఒంపులోన సొంపులిచ్చి..చెంపలోన కెంపులిచ్చి ఒదిగే వేళలో
నిద్దరోని కొత్తపిచ్చి నిన్ను చూసి..కన్నుగిచ్చి కలిసే ఆశలో
అల్లారు వయ్యారాలే..అల్లాడిపోయే వేళ
చల్లారు పొద్దుల్లోన..ఊపెయ్యనా ఉయ్యాల
ఇదేమి గోలా..ఆ ఆ ఆ..వరించు వేళ
మనసెరిగిన సొగసరి..మదనుడి మగసిరి కలబడితే

ఓ హోహో..నవీనా నవీనా నవీనా
ఓ నవీనా..నవీనా..నవీనా ఓ ఓ ఓ ఓ ఓ
ఈ జగాన నువ్వేనా హసీనా ఓ ఓ ఓ ఓ ఓ
గాలి గిలిగింత చెలి గాలి పులకింత
తొలి ప్రేమదెంత ఘాటు తాకిడో
మ్మ్..ఆహాహా..ఒహోహో

అమ్మ బ్రహ్మదేవుడో

అమ్మ బ్రహ్మదేవుడో
గోవిందా గోవిందా (1993)
సంగీతం::రాజ్ కోటి
రచన::సిరివెన్నెల 
గానం::బాలు, చిత్ర, మాల్గాడి శుభ

ఉయ్.. టముకెయ్ డుండుండిగా
సందడి సెయ్ తమాషగా అంగరంగ వైభోగంగా
సంబరం వీధుల్లో సేరి శివమెత్తంగా
ఉయ్.. దరువెయి తధినక అడుగెయ్ రా
అదీ లెక్క సామిరంగ సిందాడంగా
శీనయ్యే ఏడుకొండలు దిగి కిందికిరాగా

అమ్మ బ్రహ్మదేవుడో....
కొంప ముంచినావురో....
ఎంత గొప్ప సొగసురో...
యాడ దాచినావురో...
పూల రెక్కలు...
కొన్ని తేనె చుక్కలు
రంగరిస్తివో... 
ఇలా బొమ్మ చేస్తివో
అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా...?
కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా..!

కనురెప్పలు పడనప్పుడు 
కల కళ్ళపడదుగా
కనుకిప్పుడు ఎదరున్నది 
కల్లై పోదుగా...!

కనురెప్పలు పడనప్పుడు 
కల కళ్ళపడదుగా
కనుకిప్పుడు ఎదరున్నది 
కల్లై పోదుగా

ఒకటై సిన్నా పెద్దా అంతా సుట్టూ చేరండి
తకతై ఆటాడించే సోద్యం చూడండి
చంద్రుళ్ళో కుందేలు
సందెల్లో అందాలు
మన ముంగిట్లో కథాకళి ఆడేనా...
అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా
కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా
అమ్మ బ్రహ్మదేవుడో 
అరె కొంప ముంచినావురో
ఎంత గొప్ప సొగసురో 
యాడ దాచినావురో

మహ గొప్పగ మురిపించగ సరికొత్త సంగతి
తలతిప్పగ మనసొప్పక నిలిచే జాబిలి

మహగొప్పగ మురిపించగ సరికొత్త సంగతి
తలతిప్పగ మనసొప్పక నిలిచే జాబిలి

అప్పనా తన్నమన్నా కథం తొక్కే పథానా
తప్పనా తన మన తేడాలేమైనా

తందానా తాళానా కిందైనా మీదైనా
తలవంచేనా తెల్లారులు థిల్లానా

అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా
కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా

అమ్మ బ్రహ్మదేవుడో 
కొంప ముంచినావురో
ఎంత గొప్ప సొగసురో 
యాడ దాచినావురో
పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు
రంగరిస్తివో ఇలా బొమ్మ చేస్తివో
అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా...

ఉయ్.. టముకెయ్ డుండుండిగా
సందడి సెయ్ తమాషగా అంగరంగ వైభోగంగా
సంబరం వీధుల్లో సేరి శివమెత్తంగా
ఉయ్.. దరువెయి తధినక అడుగెయ్ రా
అదీ లెక్క సామిరంగ సిందాడంగా
శీనయ్యా ఏడుకొండలు దిగి కిందికిరాగా...

ఇందిర మందిర సుందర కారా


ఇందిర మందిర
గోవిందా గోవిందా (1993)
సంగీతం::రాజ్ కోటి
రచన::వేటూరి
గానం::S.P.బాలు,K.S.చిత్ర

ఇందిర మందిర సుందర కారా

ఎందుక  త్తొందర సందిట చేరా
ఇందిర మందిర సుందర కారా
అందుకె  త్తొందర సందిట చేరా
మానస చోర మల్లెల వీరా మాటరా
మాప్పటి శూరా మన్మథ వీరా మోతరా..ఓ ..ఓ
ఇందిర మందిర సుందర కారా
ఎందుక  త్తొందర సందిట చేరా
ఇందిర మందిర సుందర కారా
అందుకె  త్తొందర సందిట చేరా

ఆరూ బయటా తక్ తక్ తకధిమి
కన్నె జారే పైటా ధిక్ తక్ తికధిన్
తాళాలూ తప్పెట్లూ ఆగాలిలే
పూల దుప్పట్లు చప్పట్లు మోగాలిలే
కౌగిట్లో కాలాలు కాగాలిలే
చిమ్మ చీకట్లో సిగ్గమ్మ కరగాలిలే
కొట్టినా తిట్టినా గుట్టుగా కట్టుకో కుర్రడో
కట్టీనా పట్టీనా ప్రేమగా తట్టుకో అమ్మడో
కొత్త నీ జోడుకి కొక్కరో కోడుకీ
పొత్తులే రద్దురా నన్ను లేపొద్దురా
ఇందిర మందిర సుందర కారా
ఎందుక  త్తొందర సందిట చేరా

వైశాఖంలో తత్ తత్ తరిగిట
వచ్చీ ఆషాఢంలో ధిత్ తత్ తిరగిట
కార్తీకంలో తత్ తత్ తరిగిట
వస్తే హేమంతంలో ధిత్ తత్ తరిగిట
నీ గుండే గుప్పిల్లు విప్పాలిలే
ప్రేమ గుప్పంటు సందేల రేగాలిలే
మంత్రాలు తంత్రాలు మానాలిలే
ప్రేమ సూత్రాల కావ్యాలు రాయాలిలే
తప్పులే ఒప్పులూ పెట్టకే తిప్పలు అమ్మడో
గొప్పలే చెప్పినా పప్పులే ఉడుకునా కుర్రడో
అబ్బనీ పట్టులో కమ్మనీ హాయిరో
చేతలే ముద్దులే మాటలింకొద్దులే

ఇందిర మందిర సుందర కారా
ఎందుక  త్తొందర సందిట చేరా
ఇందిర మందిర సుందర కారా
అందుకె  త్తొందర సందిట చేరా
మానస చోర మల్లెల వీరా మాటరా
మాప్పటి శూరా మన్మథ వీరా మోతరా..ఓ ..ఓ