December 22, 2019

గొడవే గొడవమ్మ


గొడవే గొడవమ్మ
చిత్రం :  మరణ మృదంగం (1988)
సంగీతం :  ఇళయరాజా
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు, చిత్ర

పల్లవి :

గొడవే గొడవమ్మ చేయి పట్టే చిలిపివాడమ్మ...
గొడవే లేదమ్మా దారి పట్టీ పొదకే పదవమ్మ...
అడుగు అడిగేదడుగు... వయసే మిడిసి పడుతుంటే...
తళుకే సుడులై తిరిగి ఒరిగి ఒదిగి పోతుంటే...
తడిసి మెడిసి మెరిసే సొగసు ఒడిసి పడుతు

గొడవే గొడవమ్మ చేయి పట్టే చిలిపివాడమ్మ
గొడవే లేదమ్మా దారి పట్టీ పొదకే పదవమ్మ

చరణం 1 :

మొదటే చలి గాలి సలహాలు వింటే
ముసిరే మోహాలు దాహాలు పెంచే

కసిగా నీ చూపు నా దుంప తెంచే
అసలే నీ వంపు నా కొంప ముంచే

ముదిరే వలుపుల్లో నిదరే సెలవంట
కుదిరే మనువుల్లో ఎదురే నే ఉంటా
బెదిరే కళ్ళలో కథలే నే వింటా
అదిరే గుండెలో శృతులే ముద్దంటా

దోబూచులాడేటి అందమొకటి ఉంది
దోచేసుకోలేని బంధమొకటి అంది

పగతో రగిలే పరువం సిగలో విరిసే మరువం
పగలే పెరిగే బిడియం కలిసి జరిగే ప్రణయం

గొడవే గొడవమ్మ చేయి పట్టే చిలిపివాడమ్మ...
గొడవే లేదమ్మా దారి పట్టి పొదకే పదవమ్మ..
అడుగు అడిగేదడుగు వయసే మిడిసి పడుతుంటే
తళుకే సుడులై తిరిగి ఒరిగి ఒదిగి పోతుంటే
తడిసి మెడిసి మెరిసే సొగసు ఒడిసి పడుతు

గొడవే గొడవమ్మ చేయి పట్టే చిలిపివాడమ్మ
గొడవే లేదమ్మా దారి పట్టీ పొదకే పదవమ్మ

చరణం 2 :

ఇపుడే తెలిసింది ఈ ప్రేమ ఘాటు
పడితే తెలిసింది తొలిప్రేమ కాటు
కునుకే లేకున్న ఈ నైట్ బీటు
ఎపుడో మార్చింది నా హార్ట్ బీటు

పిలిచే వయసుల్తో జరిగే పేరంటం
మొలిచే సొగసుల్తో పెరిగే ఆరాటం
చలికే వొళ్ళంతా పలికే సంగీతం
సరదా పొద్దులో కరిగే సాయంత్రం

నీ ఎడారి నిండా ఉదకమండలాలు
నీ సితార దాటే మౌన పంజరాలు
తనువే తగిలే హృదయం కనులై విరిసే ఉదయం
జతగా దొరికే సమయం ఒకటైపోయే ఉభయం

గొడవే గొడవమ్మ చేయి పట్టే చిలిపివాడమ్మ...
గొడవే లేదమ్మా దారి పట్టీ పొదకే పదవమ్మ..
అడుగు అడిగేదడుగు వయసే మిడిసి పడుతుంటే
తళుకే సుడులై తిరిగి ఒరిగి ఒదిగి పోతుంటే
తడిసి మెడిసి మెరిసే సొగసు ఒడిసి పడుతు

గొడవే గొడవమ్మ చేయి పట్టే చిలిపివాడమ్మ
గొడవే లేదమ్మా దారి పట్టి పోదకే పదవమ్మ