మాటిస్తాలే
ఘటన (1990)
వేటూరి
మనోజ్
బాలు, జానకి
మాటిస్తాలే మనసిస్తాలే
చోటిస్తే ఈ రాతిరి
మాటిస్తాలే మనసిస్తాలే
చోటిస్తే ఈ రాతిరి
పండిస్తాలే దిండిస్తాలే
పంచిస్తే నీ కౌగిలి
కోలాటాలాడుకోనా నీ కొంగుతోనే
నీలాటి రేవుకాడా నీ పొంగుతోనే
మన్నిస్తాలే నన్నిస్తాలే
మాటిస్తే ఈ రాతిరి
సిగ్గొస్తున్నా ముద్దిస్తాలే
ఆపేస్తే నీ అల్లరి
పేరంటాలాడుకోనా నీ జంటలోనే
పేరంటూ తెచ్చుకోనా నీ ప్రేమతోనే
నీ అందమే ముద్దమందారమై
పట్టింది విరితేనె దోసిళ్ళనే
నీ చూపుకే విచ్చి శృంగారమే
అడిగింది నీ తీపి ఎంగిళ్ళనే
వరించాను నీలో వసంతాలు చూసి
సరే అంది ఈడే సరాగాలు దూసి
ఆగదీ లాహిరీ
మన్నిస్తాలే నన్నిస్తాలే
మాటిస్తే ఈ రాతిరి
సిగ్గొస్తున్నా ముద్దిస్తాలే
ఆపేస్తే నీ అల్లరి
నీ సందె వెచ్చాల సందిళ్ళకే
పండింది నా లేత వయ్యారమే
నీ జారు రూపాల దీపాలకే
చేసింది నా కన్ను జాగారమే
సఖీ అన్న నాడే సుఖించింది ఈడు
చెలీ అన్న మాటే ఛలో అంది తోడు
ఆగదీ లాహిరీ
మాటిస్తాలే మనసిస్తాలే
చోటిస్తే ఈ రాతిరి
మన్నిస్తాలే నన్నిస్తాలే
మాటిస్తే ఈ రాతిరి
కోలాటాలాడుకోనా నీ కొంగుతోనే
పేరంటాలాడుకోనా నీ జంటలోనే