చందమామ రాతిరేళ కదిలెనే
చిత్రం : అంజలి (1990)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : రాజశ్రీ
గానం : జానకి బృందం
చందమామ రాతిరేళ కదిలెనే
వరాల రెక్కలన్ని పరిచి నేల చేరెనే
చందమామ రాతిరేళ కదిలెనే
వరాల రెక్కలన్ని పరిచి నేల చేరెనే
తానొంటిగా కావాలనీ ఆకాశమే విడిచి వచ్చెనే
భూమి చూసి పరవశించెనే
మరల... మరల... మరల
చందమామ రాతిరేళ కదిలెనే
వరాల రెక్కలన్ని పరిచి నేల చేరెనే
చందమామ రాతిరేళ కదిలెనే
వరాల రెక్కలన్ని పరిచి నేల చేరెనే
చరణం 1:
వెన్నెలల్లె వీధి వీధి వెలుగుతున్న దీపములను
చందమామ లాగి చూసెనే
వేయి వేయి మెరుపులన్ని ఒకటిచేరి మెరిసెనంచు
మనసులోన తాను తలిచెనే
మాయమంత్రమో ఇంద్రజాలమో
అని తలంచి తాకి చూసెనే
తాకినంతలో షాకు తగిలెనే
మనిషి ఓలే చేయి కాలెనే
ఆ బాధ పడలేక ఆ సంద్రం తీరాన
దారి చేరెనే నింగి చూసెనే
మేఘమాల పులకరించెనే
మరల... మరల...
చరణం 2:
చిన్నముల్లు పెద్దముల్లు ఒకేచోట చేరుకోగ
పన్నెండు గంటలాయెనే
పాత యేడు పోయెనంటు కొత్త యేడు వచ్చెనంటు
ఊరిలోన సందడాయెనే
రాగమంతటా వెల్లివిరిసెనే
శోకమంత తరలిపోయెనే
ఈ భూమియే ఈ వేళలో
స్వర్గమల్లె మారిపోయెనే
నెలవంక జతకోసం ఒకమేఘం దరిచేరి
అల్లాడెనే పోరాడెనే
నా వెంట రా అన్నది
మరల... మరల...
చందమామ రాతిరేళ కదిలెనే
వరాల రెక్కలన్ని పరిచి నేల చేరెనే
చందమామ రాతిరేళ కదిలెనే
వరాల రెక్కలన్ని పరిచి నేల చేరెనే
తానొంటిగా కావాలనీ ఆకాశమే విడిచి వచ్చెనే
భూమి చూసి పరవశించెనే
మరల... మరల... మరల