December 22, 2019

బాగున్నావే ముద్దొచ్చే బుగ్గల్లో సిగ్గమ్మా


బాగున్నావే
చిత్రం: రుక్మిణి (1997)
సంగీతం: విద్యాసాగర్
గానం: బాలు, చిత్ర
రచన: సిరివెన్నెల

బాగున్నావే ముద్దొచ్చే బుగ్గల్లో సిగ్గమ్మా
బంగారంలా పండిందీ ఎంచక్క నీజన్మా
మాటలతోనే తానూ ముద్దాడేనమ్మా
చేతుల్లో వాలాకా వయసు సొగసు ఏమవునోనమ్మా

చరణం 1:

శిరస్సు ఎత్తలేనీ అంత బరువు ఏవిటో
చిలిపి ఊహలన్నీ సిగపూలై చేరెనేమో
నిమిషమాగలేనీ తమ తమకమేవిటో
వలపు ఊసులన్నీ వెనకాలే తరిమినేమో
కన్నెగా ఉండగా సిగ్గు తప్పదే ఇప్పుడెందుకే
కొత్తగా ఉన్న నీ అగ్గి చూపునే తప్పుకుందుకే
ఇప్పుడే ఇక్కడే.....అప్పుడే అక్కడే
ఒప్పుకోమంటే ఒప్పు తప్పులెందుకే

చరణం 2:

ఊ ళ ళ ఆయి ఆయి అని వెన్నెల పాడగా
ఉడుకు తీరిపోయి నిదరోవా వెంటపడకా
ఇంత మంచి రేయి మన మధ్యన చేరగా
నిదర పారిపోయి నిదరోదా కంట పడకా
రెచ్చిపోతున్నది పిచ్చి వైఖరీ పచ్చి పోకిరీ
రెచ్చిపోమన్నదే తీపి తిమ్మిరి వచ్చిపోమరీ
చిఛీపో  ఎంగిలి.. అందుకే చెక్కిలీ..
అచ్చట ముచ్చట తొంగి చూసె జాబిలీ