December 25, 2019

అరుణా...అరుణా....



"అరుణకిరణం" మైనంపాటి భాస్కర్ రాసిన "వెన్నెల మెట్లు" అనే నవల ఆధారంగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో రూపొందించబడింది.
అరుణా...అరుణా....
చిత్రం :  అరుణకిరణం (1986)
సంగీతం :   చక్రవర్తి
గీతరచయిత :  జాలాది రాజారావు
నేపధ్య గానం :  వందేమాతరం శ్రీనివాస్, సుశీల

అరుణా...అరుణా....అరుణా
హృదయంలో అరుణం
అరుణం
ఉదయంలో అరుణం
అరుణం
ఎన్నెన్ని జన్మాలదో ఈ ఋణం
అనురాగమై విరిసె అరుణారుణం
ఆ....ఆ..ఆ..ఆ

హృదయంలో అరుణం
అరుణం
ఉదయంలో అరుణం
అరుణం

చరణం 1:

దిశలే పరవశమై
వికసించినదెందుకు అరుణం
దివిలో రవికిరణం
తన కోరిక తీర్చిన ప్రణయం
కలలై కలవరించె
నీ...లో కోరిక
నిజమై ఋజువుకాగా
నా...లో వేడుకా
మనసే మధురగీతం పాడగా
వయసే వలపునాట్యం ఆడగా
ఆ....ఆ..ఆ..ఆ
హృదయంలో అరుణం
అరుణం
ఉదయంలో అరుణం
అరుణం

చరణం 2:

యుగమే చెరిసగమై
విరబూసినదీ మందారం
తనువై తన మనువై
రవళించినదే సింధూరం
అందం ప్రణయగంధం
నీ..పై చల్లగా
సాగే ప్రేమరాగం
నా..లో మెల్లగా
అరుణం అమరనాట్యం ఆడగా
కిరణం కరుణగీతం పాడగా
ఆ....ఆ..ఆ..ఆ

హృదయంలో అరుణం
అరుణం
ఉదయంలో అరుణం
అరుణం
ఎన్నెన్ని జన్మాలదో ఈ ఋణం
అనురాగమై విరిసె అరుణారుణం
ఆ....ఆ..ఆ..ఆ
అరుణా...అరుణా....అరుణా