సినిమా సినిమా సినిమా
కథానాయకుడు (2008)
జి.వి. ప్రకాశ్ కుమార్
శంకర్ మహాదేవన్
సినిమా సినిమా సినిమా
ఎన్ఠీఆర్ ఏఎన్నార్ ఎంజీఆర్ రాజ్ కుమార్
ఎంతోమంది వచ్చారండి అంతా సినిమా మహిమ
కృష్ణుడినెవ్వడు చూసాడు?
మనకళ్ళకి చూపింది ఈ సినిమా
స్వర్గమునెవ్వడు చేరాడు?
మన దరికి చేర్చింది ఈ సినిమా
కష్టం ఒక్కటే ఇచట నేస్తమని
నిరూపించాడు సూపర్ స్టార్
చూడు చూడు షూటింగు చూడు శ్రమ ఎంతో ఉంటదంట
ఒకరు కాదు ఒక వందమంది చెమటోడుస్తారంట
క్రేను లైన కెమెరాలనైన ట్రాలీసు లైటు నైనా
మోయుచున్న కుర్రాళ్ళు కూడా ఎంతో ముఖ్యం నాయ్ నా
రంగులేయు మేకప్పు మ్యాను చిందేటి సైడు డ్యాన్సర్
సాహసాల కనువిందులన్ని అందించే ఫైట్ మాస్టర్
సెట్టులేయు సెట్టింగు వాళ్ళు సంగీత గీత కరులు
అంతమంది వీళ్ళంతమంది కలిస్తేనేలే
సూపర్ స్టార్....సినిమా
కొన్నవాళ్ళు కోట్లున్నవాళ్ళు అవుతారు తప్పకుండా
సూపర్ స్టార్....సినిమా
హాలుబయట బజ్జీలు అమ్మి బంగ్లాలు కట్టలేదా?
తాను నడిచివచ్చు నేలా
అడుగు వందకోట్లవుతుంది
తను పలుకు ఒక్కమాట
అది వరాలామూటా
సినిమా సినిమా సినిమా
ఎన్ఠీఆర్ ఏఎన్నార్ ఎంజీఆర్ రాజ్ కుమార్
ఎంతోమంది వచ్చారండి అంతా సినిమా మహిమ
కృష్ణుడినెవ్వడు చూసాడు?
మనకళ్ళకి చూపింది ఈ సినిమా
సూపర్ స్టార్....ఉంటాడు
పోరగాళ్ళ చొక్కాలపైన పోరీల సంచిలోనా
సూపర్ స్టార్....ఉంటాడు
కారుడోరు అద్దాల పైన లారీలు బళ్ళలోనా
చైనా జపాన్ లలోనా
హాంగ్ కాంగ్ మలేసియా దేశాల్లోనా
ప్రతివాడి గుండెలోనా
మరి సూపర్ స్టారేరా
కష్టం ఒక్కటే ఇచట నేస్తమని
నిరూపించాడు సూపర్ స్టార్
సినిమా సినిమా సినిమా
ఎన్ఠీఆర్ ఏఎన్నార్ ఎంజీఆర్ రాజ్ కుమార్
ఎంతోమంది వచ్చారండి అంతా సినిమా మహిమ