వస్తావ జానకి
చిత్రం: సర్కస్ సత్తిపండు (1997)
సంగీతం: యుగంధర్
గానం: స్వర్ణలత, బాలు
అరె అరె అరె అరే….
సంక్రాంతి పండగొచ్చె
సంబరాలు మోసుకొచ్చె
సంక్రాంతి పండగొచ్చె
సంబరాలు మోసుకొచ్చె
వస్తావ జానకి వస్తావ జానకి
వస్తావ జానకి వంగతోటకి
నువు వస్తావ జానకి సిందులాటకి
వస్తావ జానకి వంగతోటకి
నువు వస్తావ జానకి సిందులాటకీ…
సల్ల గాలి వచ్చి పోయె
సన్న మల్లె సోలిపోయె
సల్ల గాలి వచ్చి పోయె
సన్న మల్లె సోలిపోయె
వస్తాను మావరొ వస్తాను మావరొ
వస్తాను మావరొ ముద్దులాటకి
నేను వస్తాను మావరొ మిద్దె మీదకి
వస్తాను మావరొ ముద్దులాటకి
నేను వస్తాను మావరొ మిద్దె మీదకి
పైటేస్తే నా ఒళ్లు
పోటెత్తి నట్లుంది…
పట్టుకుంటె నాకెవరో
పైట లాగినట్టుంది.
ప్రాయమొచ్చి నాకేదొ పిచ్చి పట్టినట్టుంది
నిన్ను చూస్తే నాకేమొ
ప్రేమ పుట్టుకొస్తుంది
యే మత్తు చల్లావో.. యే మత్తు చల్లావో..
యే మత్తు చల్లావో… ఓరి నాయనో నేను
నీ సొంత మైనాను వెర్రి నాయన
యే మత్తు చల్లావో… ఓరి నాయనో నేను
నీ సొంత మైనాను వెర్రి నాయన
ఒంటి నొప్పులొచ్చినాక
కౌగిలిస్తే పండగ
చాటు పక్కలన్ని చూసి కన్ను కొడితే పండగ
మెరిసే బుగ్గల పైన
ముద్దు పెడితె పండగ
హంస నడకలపైన
మనసు పడితే పండగ
యే మంత్రమేశావో..
యే మంత్రమేశావో…
యే మంత్రమేశావో.. చిన్నదాన
నువు నన్ను దోచుకున్నావే కుర్రదాన
యే మంత్రమేశావో.. చిన్నదాన
నువు నన్ను దోచుకున్నావే కుర్రదాన…
బావి నీళ్లకు పోతే బిందెల్లో వుంటావు
బువ్వ తిందామంటే ముద్దల్లో వుంటావు
ముద్దల్లో నన్ను చూసి ముద్దివ్వ మంటావు
ముద్దడిగి నా ముందే మరుగై పోతుంటావు
యే మాయ చేశావో.. యే మాయ చేశావో..
యే మాయ చేశావో… ఓరి మావ నువు
నా మనసు దోచావే చందమామ
చీకట్లొ నేనుంటె చిలకల్లె పలికావు
చలిమంచు పడుతుంటే పొదరింట చేరావు
పొదరింట నన్ను దోచి పందిళ్లు వేశావు
పందిళ్ళలో నాకు పరదాలు వేశావు
యే మందు చల్లావే.. యే మందు చల్లావె..
యే మందు చల్లావే… ఎర్రి దాన
నువు ఇంత పని చేశావె కుర్రదాన
యే మందు చల్లావే… ఎర్రి దాన
నువు ఇంత పని చేశావె కుర్రదాన…