జాబిల్లి రావే
అందాలరాముడు (2006)
ఎస్.ఏ.రాజ్ కుమార్
రాజేష్, శ్రేయాగోషాల్
జాబిల్లి రావే వెండి జాబిల్లి నీతోనే ఉంటానమ్మా జాబిల్లి
పల్లవి
జాబిల్లి రావే వెండి జాబిల్లి నీతోనే ఉంటానమ్మా జాబిల్లి
నిన్నే కోరిందీ వెండి జాబిల్లి నీతోడై ఉంటానంది మనసిచ్చి
మబ్బుల్లో దాగి దోబూచి ఆడి నాముందే ఉంటూ నమనసేదోచి
నీ ఎదలో చోటిచ్చావే నవ్వులు కురిపించి ||నిన్నే కోరింది||
చరణం 1
దూర దూర ఈడు తోడు లేక నేడు ఉసురుసురన్నది చూడు కోరిందే నీతోడు...
కొంటె కళ్ళ చూపు గుచ్చుకున్న నాడు రేగదామరి జోడు ఆగదే ఎద తూరు
నా వెంటె చెలి నీవుంటే ఇంకేవి కోరనులే
అవునన్నా నువు కాదన్నా నేనీలో సగమేలే
ఆ మాటే చాలమ్మా నీ నీడై ఉంటాలే ||నిన్నే కోరింది||
చరణం 2
వెన్నెలంటి నువ్వు వెన్నపూస మనసు చూసి నీలో నేను చేరువయ్యా నీకు
పాలరాతి బొమ్మపైడి పూల బొమ్మ దేవతంటే ఎవరో చూశాను నీలో నేడు
బతుకంతా నీ జతగా ఉండే వరమే ఇచ్చావే
బడిలో చదివే ఆనాడే నా ఎదలో చేరావే
నీ ఒడిలో గొప్పల్లె కలకాలం ఉంటాలె ||జాబిల్లిరావె||