మథురానగరిలో చల్లనమ్మా బోదు |

మథురానగరిలో (జావళి)
రాగం: ఆనంద భైరవి
నటభైరవి జన్య
తాళం: ఆది
రచన: చిత్తూర్ సుబ్రమణ్య పిళ్ళై   
గానం: నిత్య సంతోషిణి

పల్లవి:

మథురానగరిలో చల్లనమ్మా బోదు | 
దారి విడుము కృష్ణా, కృష్ణా ||   
(మథురా)

అనుపల్లవి

మాపటి వేళకు తప్పక వచ్చెద |
విడువుడు నా కొంగు గట్టిగాను కృష్ణా ||
(మథురా)

చరణం 1

అత్త చూసిన నన్ను ఆగడి చేయును
ఆగడమేలరా అందగాడ కృష్ణా || (మథురా)

చరణం 2

కొసరి కొసరి నాతో సరసములాడకు |
రాజమార్గమిది కృష్ణా కృష్ణా ||
(మథురా)

చరణం 3

వ్రజ వనితలు నిటు చేరవత్తురిక |
విడు విడు నా కొంగు కృష్ణా కృష్ణా ||
(మథురా)