December 26, 2019

హలో హలో లైలా

హలో హలో లైలా
దడ (2011)
అనంతశ్రీరామ్
దేవిశ్రీప్రసాద్
నేహా బసిన్, నిఖిల్ డిసౌజా

ఓ హలో హలో హలో లైలా మాయమైంది నా మనస్సు నీవల్ల
ఏమైందో ఎక్కడున్నాదో కళ్లముందే దాగి ఉండు పగటిపూట తారలా
హలో హలో హలో చాలా చేసినావు చాలులేరా గోపాలా
నాలోనే దాచి పెట్టేసి ఏమీ తెలియనట్టు నాటకాలు ఆడమాకలా
ఐతే నా మనసు నిన్ను చేరినట్టు నీకు కూడ తెలిసినట్టే
ఐనా ముందు అడుగు వేయకుండా ఆపుతావు అదేమిటే
పెదాలతో ముడేయనా...
ప్రతిక్షణం అదే పనా...

ముద్దుదాకా వెళ్లనిచ్చి హద్దు దాటనీయవేంటి
కావాలమ్మా కౌగిలి కౌగిలి ఓ చెలీ చెలీ
కొద్దిపాటి కౌగిలిస్తే కొత్తదేదో కోరుకుంటూ
చేస్తావేమో అల్లరి అల్లరి మరి మరి మరి
అమ్మో నా లోపలున్నదంతా అచ్చు గుద్దినట్టు చెప్పినావే
అవునోయ్ నీకంతకన్నా గొప్పఆశ ఇప్పుడైతే రానే రాదోయ్
అందాలతో ఆటాడనా...
అనుక్షణం అదే పనా...
హలో హలో హలో లైలా మాయమైంది నా మనస్సు నీవల్ల
ఏమైందో ఎక్కడున్నాదో కళ్లముందే దాగి ఉండు పగటిపూట తారలా

ఒక్కసారి చాలలేదు మక్కువంత తీరలేదు
ఇంకోసారి అన్నది అన్నది మది మది మది
ఒడ్డుదాకే హద్దు నీకు లోతుకొచ్చి వేడుకోకు
నీదే పూచీ నీదిలే నీదిలే భలే భలే భలే
ఆ మాత్రం సాగనిస్తే చాలునమ్మా సాగరాన్ని చుట్టిరానా
నీ ఆత్రం తీరిపోవు వేళదాకా తీరమైన చూపిస్తానా
సుఖాలలో ముంచెయ్యనా...
క్షణక్షణం అదే పనా...
ఓ హలో హలో హలో లైలా మాయమైంది నా మనస్సు నీవల్ల
ఏమైందో ఎక్కడున్నాదో కళ్లముందే దాగి ఉండు పగటిపూట తారలా