Showing posts with label దడ (2011). Show all posts
Showing posts with label దడ (2011). Show all posts

దీవాళీ దీపాన్ని

దీవాళీ దీపాన్ని
దడ (2011)
రామజోగయ్యశాస్త్రి
దేవిశ్రీప్రసాద్
కల్యాణ్, ఆండ్రియా

చక్కెర చిన్నోడ ఆలే కత్తెర కళ్లోడా ఆలే
చూడర బుల్లోడా ఆలే అందాన్ని
ఒంటరి పిల్లోడ ఆలే తుంటరి పిల్లోడా ఆలే
వద్దకు లాగెయ్‌ రా ఆలే వజ్రాన్ని

దీవాళీ దీపాన్ని సాంబ్రాణి ధూపాన్ని
నీ కళ్లలోన ఆకళ్లు పెంచే రూపాన్ని
బంధించే దారాన్ని తీపనిపించే కారాన్ని
ఎన్నటికైనా నిన్నే కోరే నీదాన్ని

చక్కెర చిన్నోడ ఆలే కత్తెర కళ్లోడా ఆలే
చూడర బుల్లోడా ఆలే అందాన్ని

ఊరించే నిషాని ఊపిరిపోసే విషాన్ని
నెత్తురు లోతుకు హత్తుకుపోయిన స్నేహాన్ని
అత్తరు పూసిన బాణాన్ని అల్లాడిస్తా ప్రాణాన్ని
అల్లుకుపోరా కాముడు రాసిన గ్రంథాన్ని
చక్కెర చిన్నోడ ఆలే కత్తెర కళ్లోడా ఆలే
చూడర బుల్లోడా ఆలే అందాన్ని

కదిలే నావలా వయసే ఊయల
ఎదటే నువ్వలా గిచ్చే కన్నై చూస్తుంటే
నిజమా ఈ కల అనిపించేంతలా
మనసే గువ్వలా గాల్లో తేలిందే
నీపక్క చోటిస్తే నన్నే నానుంచి దోచిస్తా
నాకే నీలోన చోటిస్తే నన్నే దాచేస్తా
ఓ... నీ గూడు నాకిస్తే ఇందా నా గుండె నీకిస్తా
నీతో వెయ్యేళ్లు రానిస్తే నన్నే రాసిస్తా
దీవాళీ దీపాన్ని సాంబ్రాణి ధూపాన్ని
నీ కళ్లలోన ఆకళ్లు పెంచే రూపాన్ని
బంధించే దారాన్ని తీపనిపించే కారాన్ని
ఎన్నటికైనా నిన్నే కోరే నీదాన్ని

ఒకడే వేయిగా కదిలే మాయగా
కనిపించావుగా అటూ ఇటూ నా చుట్టూ
సలసల హాయిగా సరసున రాయిగ
కదిలించావుగా ప్రాయం పొంగేట్టు
పొందుకు వస్తావో నాతో పొత్తుకు వస్తావో
ఎటో ఎత్తుకు పోతావో అంతా నీ ఇష్టం
ఉప్పెన తెస్తావో నొప్పిని ఉఫ్ఫనిపిస్తావో
తప్పని తప్పును చేస్తావో అందం నీ సొంతం
దీవాళీ దీపాన్ని సాంబ్రాణి ధూపాన్ని
నీ కళ్లలోన ఆకళ్లు పెంచే రూపాన్ని
బంధించే దారాన్ని తీపనిపించే కారాన్ని
ఎన్నటికైనా నిన్నే కోరే నీదాన్ని

ఏ పిల్లా పిల్లా

ఏ పిల్లా పిల్లా
దడ (2011)
రామజోగయ్యశాస్త్రి
దేవిశ్రీప్రసాద్
జస్ ప్రీత్, సుచిత్ర

ఏ పిల్లా పిల్లా పిల్లా పిల్లా పిల్లా పిల్లా పిల్లా
ఏ పిల్లా పిల్లా పిల్లా నా స్వీటు సిండరెల్లా
నీ నెత్తిన పెట్టేస్తానే ఓ బొట్టు బిళ్ల
ఈ పిల్లా పిల్లా పిల్లా నీదేరా గ్రీకు వీరా
నీ షర్టుకు ముడేస్తారా నా పట్టుచీర
తీనుమారే హోహో దిల్లు కోరే హోహో
నిన్ను డైమండ్ రింగై రమ్మంది నా టెండర్ ఫింగరే
హే రయ్యా రయ్యా రయ్యంటుంది గాడి
అయిపోదాం పదా నంబర్ వన్న జోడి
హే తయ్యారయ్యే ఉంది లక్కీ లేడి
ఇక మోగించెయ్ పీప్పీప్పీ మెలోడి
ఏ పిల్లా పిల్లా పిల్లా నా స్వీటు సిండరెల్లా
నీ నెత్తిన పెట్టేస్తానే ఓ బొట్టు బిళ్ల

ఐఫిల్ టవర్ అంచులోన లవ్ సింబల్ షేపులోన
రిచ్‌ గా పెళ్లికి వెన్యూ సెట్‌చేసెయ్‌నా కన్నె కూనా
ముద్దుగా మూడేముళ్లు నీ మెళ్లోన వేసుకోనా
ఎయిర్ బస్ పల్లకీలో పక్కనొచ్చి వాలిపోనా
బుద్ధిగా తలొంచేసి తలంబ్రాలు పోసుకోనా
హార్ట్‌ లో వేసిన టెంటు పర్మనెంట్ చేసుకోనా
హేయ్ సోనా సోనా పబ్బుల్లో గానాబజానా
వారెవ్వా వాట్ ఏ పెళ్లి అనాలెవరైనా
హే రయ్యా రయ్యా రయ్యంటుంది గాడి
అయిపోదాం పదా నంబర్ వన్న జోడి
హే తయ్యారయ్యే ఉంది లక్కీ లేడి
ఇక మోగించెయ్ పీప్పీప్పీ మెలోడి

చాక్‌లెట్ ర్యాపర్‌లా గిఫ్ట్‌ఫ్యాక్ పేపర్లా
లెఫ్టు రైటు అటు ఇటూ చుట్టేస్తానే ఐస్ పిల్లా
వెచ్చగా టాప్ టూ బోటమ్ అంటుకుపోతా స్టిక్కరులా
పంజరాన ప్యారెట్‌లా పెవికాల్ మ్యాగ్నెట్‌లా
ఆల్ ది టైమ్ నీతో ఉంటా మెళ్లో వేసిన లాకెట్టులా
నీకు నాకు సెంటీమీటర్ గ్యాపే ఉన్నా నచ్చదురా
ఏ పిల్లా పిల్లా ఇలా రావే రసగుల్లా
నా షాడో నీ షాడో మ్యాచ్ అయ్యేలా
హే రయ్యా రయ్యా రయ్యంటుంది గాడి
అయిపోదాం పదా నంబర్ వన్ జోడి
హే తయ్యారయ్యే ఉంది లక్కీ లేడి
ఇక మోగించెయ్ పీప్పీప్పీ మెలోడి
ఏ పిల్లా పిల్లా పిల్లా నా స్వీటు సిండరెల్లా
నీ నెత్తిన పెట్టేస్తానే ఓ బొట్టు బిళ్ల
ఈ పిల్లా పిల్లా పిల్లా నీదేరా గ్రీకు వీరా
నీ షర్టుకు ముడేస్తారా నా పట్టుచీర

హలో హలో లైలా

హలో హలో లైలా
దడ (2011)
అనంతశ్రీరామ్
దేవిశ్రీప్రసాద్
నేహా బసిన్, నిఖిల్ డిసౌజా

ఓ హలో హలో హలో లైలా మాయమైంది నా మనస్సు నీవల్ల
ఏమైందో ఎక్కడున్నాదో కళ్లముందే దాగి ఉండు పగటిపూట తారలా
హలో హలో హలో చాలా చేసినావు చాలులేరా గోపాలా
నాలోనే దాచి పెట్టేసి ఏమీ తెలియనట్టు నాటకాలు ఆడమాకలా
ఐతే నా మనసు నిన్ను చేరినట్టు నీకు కూడ తెలిసినట్టే
ఐనా ముందు అడుగు వేయకుండా ఆపుతావు అదేమిటే
పెదాలతో ముడేయనా...
ప్రతిక్షణం అదే పనా...

ముద్దుదాకా వెళ్లనిచ్చి హద్దు దాటనీయవేంటి
కావాలమ్మా కౌగిలి కౌగిలి ఓ చెలీ చెలీ
కొద్దిపాటి కౌగిలిస్తే కొత్తదేదో కోరుకుంటూ
చేస్తావేమో అల్లరి అల్లరి మరి మరి మరి
అమ్మో నా లోపలున్నదంతా అచ్చు గుద్దినట్టు చెప్పినావే
అవునోయ్ నీకంతకన్నా గొప్పఆశ ఇప్పుడైతే రానే రాదోయ్
అందాలతో ఆటాడనా...
అనుక్షణం అదే పనా...
హలో హలో హలో లైలా మాయమైంది నా మనస్సు నీవల్ల
ఏమైందో ఎక్కడున్నాదో కళ్లముందే దాగి ఉండు పగటిపూట తారలా

ఒక్కసారి చాలలేదు మక్కువంత తీరలేదు
ఇంకోసారి అన్నది అన్నది మది మది మది
ఒడ్డుదాకే హద్దు నీకు లోతుకొచ్చి వేడుకోకు
నీదే పూచీ నీదిలే నీదిలే భలే భలే భలే
ఆ మాత్రం సాగనిస్తే చాలునమ్మా సాగరాన్ని చుట్టిరానా
నీ ఆత్రం తీరిపోవు వేళదాకా తీరమైన చూపిస్తానా
సుఖాలలో ముంచెయ్యనా...
క్షణక్షణం అదే పనా...
ఓ హలో హలో హలో లైలా మాయమైంది నా మనస్సు నీవల్ల
ఏమైందో ఎక్కడున్నాదో కళ్లముందే దాగి ఉండు పగటిపూట తారలా