ఏమి సేతురా లింగా ఏమి సేతురా

జీవిత సత్యాలను చెప్పుకోడానికి  తెలుగులో ఒక బ్రహ్మాండమయిన ప్రక్రియ ఉంది... అవే "తత్వాలు".
చర్నాకోలా తో కొట్టినట్లుండే ఆ తత్వబోధల సారాంశం ఒక్కటే...
"జీవుడా! నీ పరుగు ఆపి....ఆ దేవ దేవుని చరణాల మీద సాగిలబడు"....అని.
అందులో ఒక జనరంజకమయిన, ప్రఖ్యాతమయిన తత్వాన్ని క్రింద పంచుకుంటున్నాను.
పాడింది గాన మహేశ్వరుడు బాలమురళీకృష్ణ గారు.

ఏమి సేతురా లింగా ఏమి సేతురా
గంగ ఉదకం తెచ్చి నీకు లింగ పూజలు చేద్దామంటే
గంగనునాచేప కప్ప ఎంగిలంటున్నాది లింగ
మహానుభావ మాలింగమూర్తి మహదేవశంభో

ఏమి సేతురా లింగ ఏమి సేతురా లింగ
అక్షయావులపాడి తెచ్చి అర్పితము చేద్దమంటే
అక్షయావులలేగ దూడ ఎంగిలంటున్నాది లింగ

మహానుభావ మాహదేవ శంభో మాలింగ మూర్తి

ఏమి సేతురా లింగ ఏమి సేతురా లింగ
తుమ్మి పువ్వులు తెచ్చి నీకు తుష్టుగా పూజిద్దమంటే
కొమ్మ కొమ్మకు కోటి తుమ్మెద ఎంగిలంటున్నాది లింగ

మహనుభావ మహదేవశంభో మాలింగమూర్తి