December 23, 2019

జయ జయ జయ శ్రీ వెంకటేశా

ఘంటసాల గారి ప్రయివేట్ సాంగ్

జయ జయ జయ శ్రీ వెంకటేశా
జయ జయ జయ ఓం శ్రితజనపోష
జయ జయ జయ శ్రీ వెంకటేశ...

సనకాది ఋషులు సన్నుతి చేయ.. లక్ష్మిదేవినీ పాదంలొత్త..
బృహుకోపమున వైకుంఠమిడి.. భూలొకమునే చేరితివయ్య..

జయ జయ జయ శ్రీ వెంకటేశా
జయ జయ జయ ఓం శ్రితజనపోష
జయ జయ జయ శ్రీ వెంకటేశ...

బల్మీకమున దాగిఉండగా.. రుద్రుడే గోవై పాలివ్వ..
గొల్లడొకడు నీ శిరమున బాదగ.. ఘోరశాపమునె ఇచ్చితివయ్య..

జయ జయ జయ శ్రీ వెంకటేశా
జయ జయ జయ ఓం శ్రితజనపోష
జయ జయ జయ శ్రీ వెంకటేశ...

కానలలోన ఒంటివాడివై తిరుగుతు వకుళను జేరితివయ్య
వకుళమాతకు ముద్దు బిడ్డవై మురిపెముతోనే పెరిగితివయ్య

జయ జయ జయ శ్రీ వెంకటేశా
జయ జయ జయ ఓం శ్రితజనపోష
జయ జయ జయ శ్రీ వెంకటేశ...

అంత ఒకదినంబ్బున పూదొటలోన ఆకాశ రాజు తనయ శ్రీ పద్మావతి దేవిని గాంచి...
వలచి వలపించితివో.. మహానుభావా...ఆ..ఆ.ఆ

లొకనాధ నీ కళ్యాణమునకు కుబేరపతిని ఆశించి |2|
ఆ కుబేరధనముతొ మీకళ్యాణము మహోత్సవమ్ముగ జరిగిందయ్య

ఆనందమానందమాయెనె. పరమానందమానందమాయెనే..|2|

ధర్మపత్నితో దారిలో ఉన్న అగస్త్యముని ఆశ్రమంబ్బునారు మాసమువు
అతిధిగా ఉన్నవో..దేవా..ఆ..ఆ.ఆ.అ

కొండలపైనే తొండమానుడు అలమొకటి కట్టించెనయా|2|
స్వర్ణ శిఖరపు శేశశైలమున స్ స్థిరనివావివై నిలచితివయ్య...

జయ జయ జయ శ్రీ వెంకటేశా
జయ జయ జయ ఓం శ్రితజనపోష
జయ జయ జయ శ్రీ వెంకటేశ...

రమాదేవి నిను వెదకుచు చేరగ శిలా రూపమున వెలసితివయ్య |2|
భక్తకోటికిదే నిత్య దర్శనం.. పాపవిమోచన పుణ్య స్థలమయా...

జయ జయ జయ శ్రీ వెంకటేశా
జయ జయ జయ ఓం శ్రితజనపోష
జయ జయ జయ శ్రీ వెంకటేశ...

నీమహత్యపఠనమే మాహస్తోత్రమయా
నీదివ్యనామమే కైవల్యమయా
దీనులమము కరుణించవయ...ఓ వెంకటేశా...

నమో వెంకటేశా... నమః శ్రీనివాసా
నమో చిద్విలాసా...నమః పరమపురుశా
నమో తిరుమలేశా.. నమో కలియుగేశా
నమో వేదవేద్య.. నమో విశ్వరూపా

నమో లక్ష్మీనాధ.. నమో జగన్నాధ
నమస్తే....నమస్తే....నమః...ఆ..ఆ..ఆ..అ

ఏడుకొండలవాడ.. వెంకటరమనా...గోవిందా గోవిందా...