December 23, 2019

గోవింద గోవిందయని కొలువరే

రేకు                : 01
సంపుటము   : 10
సంకీర్తన         : 02
రాగం              : బౌళి
తాళం             : ఆది
గానం             :  శ్రీ P. ఉన్ని కృష్ణన్ గారు

పల్లవి:

గోవింద గోవిందయని కొలువరే
గోవిందాయని కొలువరే

చరణము 1

హరియచ్యుతాయని పాడరే
పురుషోత్తమాయని పొగడరే
పరమపురుషాయని పలుకరే
సిరివరయనుచును చెలగరే జనులు

చరణము 2

పాండవవరదా అని పాడరే
అండజవాహను కొనియాడరే
కొండలరాయనినే కోరరే
దండితో మాధవునినే తలచరో జనులు

చరణము 3

దేవుడు శ్రీవిభుడని తెలియరే
శోభలయనంతుని చూడరే
శ్రీవేంకటనాథుని చేరరే
పావనమైయెపుడును బతుకరే జనులు