December 23, 2019

సాగరతీర సమీపానా


సాగరతీర సమీపానా
చిత్రం : మేరీమాత - (1971)
సంగీతం : జి.దేవరాజన్
సాహిత్యం : అనిసెట్టి సుబ్బారావు
గానం : యేసుదాస్.

సాగరతీర సమీపానా..
తరగని కావ్య సుధామధురం
కాల చరిత్రకు సంకేతం..
కరుణకు చెరగని ప్రతిరూపం.

పచ్చని వృక్షములలరారు..
బంగరు పైరులు కనరారు..
మాయని సిరులే సమకూరూ..
వేలాంగన్నీ అను ఊరూ..

సాగరతీర సమీపానా..
తరగని కావ్య సుధామధురం
కాల చరీత్రకు సంకేతం..
కరుణకు చెరగని ప్రతిరూపం.

విరితావులనూ వెదజల్లీ..
వీచే చల్లని చిరుగాలీ
ఆవూ దూడల ప్రేమ గని..
పాడెను మమతల చిహ్నమనీ

సాగరతీర సమీపానా..
తరగని కావ్య సుధా మధురం
కాల చరీత్రకు సంకేతం..
కరుణకు చెరగని ప్రతిరూపం.

మట్టిని నమ్మిన కర్షకులూ..
మాణిక్యాలూ పొందేరూ..
కడలిని నమ్మిన జాలరులూ..
ఘనఫలితాలు చెందేరూ..

సాగరతీర సమీపానా..
తరగని కావ్య సుధా మధురం
కాల చరీత్రకు సంకేతం..
కరుణకు చెరగని ప్రతిరూపం.

పాలూ తేనై కలిశారూ..
అనురాగములో దంపతులూ
తోడూనీడై మెలిగారూ..
చవిచూశారూ స్వర్గాలూ..

సాగరతీర సమీపానా..
తరగని కావ్య సుధా మధురం
కాల చరీత్రకు సంకేతం..
కరుణకు చెరగని ప్రతిరూపం.