December 23, 2019

మాయా సంసారం తమ్ముడూ


మాయా సంసారం తమ్ముడూ
ఉమా సుందరి (1956)
సదాశివ బ్రహ్మం,
పిఠాపురం నాగేశ్వరరావు,
అశ్వత్థామ

మాయా సంసారం తమ్ముడూ
నీమదిలో సదా శివుని మరువకు తమ్ముడూ
మాయా సంసారం తమ్ముడూ
నీమదిలో సదా శివుని మరువకు తమ్ముడూ

ముఖము, అద్దము ఉంది మొగమాట మెందుకు
సుఖదుఃఖములు లెక్క చూసుకో తమ్ముడూ
ముఖము, అద్దము ఉంది మొగమాట మెందుకు
సుఖదుఃఖములు లెక్క చూసుకో తమ్ముడూ

సకల సమ్మోహన సంసారమందునా
సకల సమ్మోహన సంసారమందునా
సుఖాలు సున్నా దుఖాలే మిగులన్నా
సుఖాలు సున్నా దుఖాలే మిగులన్నా
మాయా సంసారం తమ్ముడూ
నీమదిలో సదా శివుని మరువకు తమ్ముడూ

కోరితెచ్చుకున్న భారమంతే గాని
ధారాపుత్రులు నిను దరిజేర్చుతారా
కోరితెచ్చుకున్న భారమంతే గాని
ధారాపుత్రులు నిను దరిజేర్చుతారా

తేరి చూసి నిజము తెలుసుకొ తమ్ముడూ
తేరి చూసి నిజము తెలుసుకొ తమ్ముడూ
సారం సత్యం సర్వం పరమాత్మా
మాయా సంసారం తమ్ముడూ
నీమదిలో సదా శివుని మరువకు తమ్ముడూ

వచ్చినప్పుడు వెంట తెచ్చినదేముంది
వచ్చినప్పుడు వెంట తెచ్చినదేముంది
పోయేటప్పుడు  కొనిపోయేదేముంది
పోయేటప్పుడు  కొనిపోయేదేముంది
అద్దెకొంప లోక మంతేరా తమ్ముడు
అద్దెకొంప లోక మంతేరా తమ్ముడు
వద్దు పొమ్మనగానే వదిలేసీ పోవాలి
మాయా సంసారం తమ్ముడూ
నీమదిలో సదా శివుని మరువకు తమ్ముడూ

"తమ్ముడూ ఇప్పుడు తెలిసిందా?
ప్రపంచంలో తిరిగినకొద్దీ తిరిగినకొద్దీ అన్నీ బాధలేనని నే చెబితే విన్నావా?"
వెర్రివాడా నీ చేతిలో ఏముంది? అంతా మాయ...!
నువ్వు చావాలనుకున్నా చావలేవు
అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ
నాచావుకు నీ అడ్డేమిటి?
నాగేంద్ర నన్నుకూడా నా ఆలుబిడ్డల దగ్గరకు చేర్చు
నన్నుకూడా నా ఆలుబిడ్డల దగ్గరకు చేర్చు
హహహ
మళ్ళీ తప్పుదారిలో పడిపోతున్నావు తమ్ముడూ
శివాజ్ఞలేనిదే చీమైనా కుట్టదు.
సరే గానీ తమ్ముడూ నీ పెళ్ళాం పిల్లలు ఎక్కడికి పోయారు?
పుట్టింటికని బయలుదేరి చచ్చిపొయ్యారు
హహహ
నా పెళ్ళాం కూడా ఒకసారి అలాగే చేసిందిలే
హహహ

నమ్మకురా ఇల్లాలు పిల్లలు
బొమ్మలురా జీవా తోలుబొమ్మలురా జీవా
నమ్మకురా ఇల్లాలు పిల్లలు
బొమ్మలురా జీవా తోలుబొమ్మలురా జీవా
సమ్మతించి నను నమ్మినవారికి
సాయుజ్యమురా జీవా
శివ సాన్నిధ్యమురా జీవా
సమ్మతించి నను నమ్మినవారికి
సాయుజ్యమురా జీవా
శివ సాన్నిధ్యమురా జీవా
ఘోరదురిత సంసార జలధిలో
జ్ఞానమె చేయూత అజ్ఞానమే ఎదురీత
జీవా జ్ఞానమె చేయూత అజ్ఞానమే ఎదురీత
ఘోరదురిత సంసార జలధిలో
జ్ఞానమె చేయూత అజ్ఞానమే ఎదురీత
జీవా జ్ఞానమె చేయూత అజ్ఞానమే ఎదురీత

మోహమెందుకీ దేహముపై
ఇది తోలుతిత్తిరా జీవా
ఉత్త గాలితిత్తిరా జీవా

మోహమెందుకీ దేహముపై
ఇది తోలుతిత్తిరా జీవా
ఉత్త గాలితిత్తిరా జీవా
నమ్మకురా ఇల్లాలు పిల్లలు
బొమ్మలురా జీవా తోలుబొమ్మలురా జీవా