జీవము నీవేకదా....

జీవము నీవేకదా....
చిత్రం : భక్త ప్రహ్లాద (1967)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : సముద్రాల
గానం : సుశీల

జీవము నీవేకదా దేవా జీవము నీవేకదా దేవా
బ్రోచే భారము నీదే కదా నా భారము నీదే కదా!!
జనకుడు నీపై కినుక వహించీ నను వధియింప మదినెంచే
చంపేదెవరూ సమసేదెవరూ సర్వము నీవే కదా స్వామీ !!

హే! ప్రభో! హే! ప్రభో!
లక్ష్మీ వల్లభ! దీన శరణ్యా! కరుణా భరణా! కమల లోచన !
కన్నుల విందువు చేయగరావే ! అశ్రిత భవ భంధ నిర్మూలనా!
లక్ష్మీ వల్లభా! లక్ష్మీ వల్లభా

నిన్నే నమ్మీ నీ పద యుగళీ, సన్నుతిజేసే భక్తావళికీ
మిన్నాగుల గన భయమదియేలా, పన్నగశయనా నారాయణా
||జీవము నీవే కదా||

మదిలో వెలిలో చీకటిమాపీ,
పథము జూపే పతితపావనా!
||జీవము నీవే కదా||

భవజలధినిబడి  తేలగలేని, జీవులబ్రోచే పరమపురుషా! నను
కాపాడి నీ  బిరుదమునూ, నిలువుకొంటివా  శ్రితమందార
||జీవము నీవేకదా||