Showing posts with label భక్త ప్రహ్లాద (1967). Show all posts
Showing posts with label భక్త ప్రహ్లాద (1967). Show all posts

హే జ్యోతి స్వరూపా

హే జ్యోతి స్వరూపా
చిత్రం : భక్త ప్రహ్లాద (1967)
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు
సాహిత్యం : సముద్రాల
గానం : సుశీల, జానకి

హే జ్యోతి స్వరూపా నారాయణా

కనులకు వెలుగువు నీవే కావా..
కనులకు వెలుగువు నీవే కావా..
కనపడు చీకటి మాయే కాదా..
కనపడు చీకటి మాయే కాదా..
నిను గనలేని ప్రాణి బ్రతుకే
నిజముగ చీకటి ఔగా దేవా..

కనులకు వెలుగువు నీవే కావా..

పేరుకు నేను తల్లిని గానీ
ఆదుకొనా లేనైతీ..
పేరుకు నేను తల్లిని గానీ
ఆదుకొనా లేనైతీ..
పాలను ద్రాపి ఆకలి బాపే
భాగ్యమునైనా నోచని నాకు
పాలను ద్రాపి ఆకలి బాపే
భాగ్యమునైనా నోచని నాకు
ఏల జనించితివయ్యా
నాకేల జనించితివయ్యా
నాకేల జనించితివయ్యా..

అండగ నుండ విధాతవీవు
అండగ నుండ విధాతవీవు
ఆకలి దప్పుల ధ్యాసే లేదు
నారాయణ నామామృత రసమే
నారాయణ నామామృత రసమే
అన్నము పానము కావా దేవా

కనులకు వెలుగువు నీవే కావా..
కనపడు చీకటి మాయే కాదా..
నిను గనలేని ప్రాణి బ్రతుకే
నిజముగ చీకటి ఔగా దేవా..
కనులకు వెలుగువు నీవే కావా..

జీవము నీవేకదా....

జీవము నీవేకదా....
చిత్రం : భక్త ప్రహ్లాద (1967)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : సముద్రాల
గానం : సుశీల

జీవము నీవేకదా దేవా జీవము నీవేకదా దేవా
బ్రోచే భారము నీదే కదా నా భారము నీదే కదా!!
జనకుడు నీపై కినుక వహించీ నను వధియింప మదినెంచే
చంపేదెవరూ సమసేదెవరూ సర్వము నీవే కదా స్వామీ !!

హే! ప్రభో! హే! ప్రభో!
లక్ష్మీ వల్లభ! దీన శరణ్యా! కరుణా భరణా! కమల లోచన !
కన్నుల విందువు చేయగరావే ! అశ్రిత భవ భంధ నిర్మూలనా!
లక్ష్మీ వల్లభా! లక్ష్మీ వల్లభా

నిన్నే నమ్మీ నీ పద యుగళీ, సన్నుతిజేసే భక్తావళికీ
మిన్నాగుల గన భయమదియేలా, పన్నగశయనా నారాయణా
||జీవము నీవే కదా||

మదిలో వెలిలో చీకటిమాపీ,
పథము జూపే పతితపావనా!
||జీవము నీవే కదా||

భవజలధినిబడి  తేలగలేని, జీవులబ్రోచే పరమపురుషా! నను
కాపాడి నీ  బిరుదమునూ, నిలువుకొంటివా  శ్రితమందార
||జీవము నీవేకదా||

నారాయణ మంత్రం....

నారాయణ మంత్రం....
చిత్రం : భక్త ప్రహ్లాద (1967)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : సముద్రాల
గానం : సుశీల

ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ
ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ
ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ

నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం
నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం
భవబంధాలు పారద్రోలి పరమునొసంగే సాధనం

నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం
నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం

గాలిని బంధించి హసించి గాసిల పనిలేదు
గాలిని బంధించి హసించి గాసిల పనిలేదు
జీవుల హింసించే క్రతువుల చేయగ పనిలేదు
జీవుల హింసించే క్రతువుల చేయగ పనిలేదు
మాధవ మధుసూధన అని మనసున తలచిన చాలుగా
మాధవ మధుసూధన అని మనసున తలచిన చాలుగా

నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం
నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం

తల్లియు తండ్రియు నారాయణుడె
గురువు చదువు నారాయణుడె
యోగము యాగము నారాయణుడె
ముక్తియు దాతయు నారాయణుడె
భవబంధాలు పారద్రోలి పరమునొసంగే సాధనం

నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం
నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం

నాథహరే శ్రీ నాథహరే
నాథహరే జగన్నాథహరే