తేనెల తేటల మాటలతో


8వ దశకములో రేడియోలో వచ్చిన దేశభక్తి లలితగీతం

తేనెల తేటల మాటలతో

రచన: ఇంద్రగంటి శ్రీకాంత శర్మ

తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా
భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవన యానం చేయుదమా

సాగర మేఖల చుట్టుకుని సుర గంగ చీరగా మలచుకొని
గీతా గానం పాడుకొని మన దేవికి ఇవ్వాలి హారతులు

గాంగ జటాధర భావనతో హిమ శైల శిఖరమే నిలబడగా
గలగల పారే నదులన్నీ ఒక బృంద గానమే చేస్తుంటే

ఎందరు వీరుల త్యాగబలం మన నేటి స్వేచ్చకే మూలబలం
వారందరిని తలచుకొని మన మానస వీధిని నిలుపుకొని