నీవు చూసే చూపులో..
చిత్రం : ఆమె ఎవరు (1966)
గానం : పి. బి.శ్రీనివాస్, ఎల్.ఆర్.ఈశ్వరి,
సాహిత్యం: దాశరథి
సంగీతం: వేదా
ఆ..అహాఅహాహా..అహాఅహహా
అహాఅహహా..అహాఅహహా
నీవు చూసే చూపులో..
ఎన్నెన్ని అర్థాలు ఉన్నవో
నీవు చూసే చూపులో..
ఎన్నెన్ని అర్థాలు ఉన్నవో
నిండు కౌగిలి నీడలో..
ఎన్నెన్ని స్వర్గాలు ఉన్నవో..ఓ..
నీవు చూసే చూపులో...
పూలగాలి వీచెలే..
లోకాలు పొంగిపోయేలే
పైట ఆటలాడెలే..
అందాలు తొంగి చూచెలే
అందాలు నీకు విందులు..
ఆ విందులే పసందులూ...
నీవు చూసే చూపులో...
తాళి మెరిసిపోవునూ..
సన్నాయి పాట పాడును
మేను సోలి పోవును..
నీ పైన వాలిపోదును
నీలి నీలి నింగిలో
ఉయ్యాలలూగుదాములే
నీలి నీలి నింగిలో....
కాలమాగిపోవలే..
ఈ హాయి సాగిపోవలే
జగము మరచిపోవలే..
మనసు కరిగిపోవలే
దూర..దూర..తీరమూ..
ఈ నాడె చేరుదాములే..
నీవు చూసే చూపులో..
ఎన్నెన్ని అర్థాలు ఉన్నవో
నిండు కౌగిలి నీడలో..
ఎన్నెన్ని స్వర్గాలు ఉన్నవో..ఓ..
నీవు చూసే చూపులో...