సీతాకోకచిలకాలమ్మా
సొగసు చూడ తరమా (1995)
అనురాధశ్రీరామ్
సిరివెన్నెల
రమణీ భరద్వాజ్
సీతాకోకచిలకాలమ్మా లేలేత చిగురాకులమ్మా
సీతాకోకచిలకాలమ్మా లేలేత చిగురాకులమ్మా
పారాడు పాపాయిలమ్మా పొంగి పారేటి సెలయేరులమ్మా
పొత్తిళ్ళలో చిట్టి పుత్తడిబొమ్మను పొదువుకున్న ముద్దుగుమ్మ అమ్మ
పొందేటి ఆనందం ఏదో తెలియాలంటే ఎత్తాలి తను ఆడజన్మ బ్రహ్మ
సీతాకోకచిలకాలమ్మా లేలేత చిగురాకులమ్మా
పారాడు పాపాయిలమ్మా పొంగి పారేటి సెలయేరులమ్మా
కుహుకుహూ కూసే కోయిలా ఏదీ పలకవే ఈ చిన్నారిలా
మిలమిలా మెరిసే వెన్నెలా ఏదీ నవ్వవే ఈ బుజ్జాయిలా
అందాల పూదోటకన్నా చిందాడు పసివాడే మిన్న
బుడత అడుగులే నడిచేటివేళలో
పుడమితల్లికెన్ని పులకలో
సీతాకోకచిలకాలమ్మా లేలేత చిగురాకులమ్మా
పారాడు పాపాయిలమ్మా పొంగి పారేటి సెలయేరులమ్మా
గలగలా వీచే గాలిలా సాగే పసితనం తియ్యని ఒక వరం
ఎదిగిన ఎదలో ఎప్పుడూ నిధిలా దాచుకో ఈ చిరు జ్ఞాపకం
చిరునవ్వుతో చెయ్యి నేస్తం చీమంత అయిపోదా కష్టం
పరుగు ఆపునా పడిపోయి లేచినా
అలుపుసొలుపు లేని ఏ అలా