December 29, 2019

నమ్మవేమో గాని..

నమ్మవేమో గాని..
పరుగు (2008)
మణిశర్మ
అనంతశ్రీరామ్
సాకేత్

నమ్మవేమో గాని.. అందాల యువరాణి
నమ్మవేమో గాని.. అందాల యువరాణి
నేలపై వాలింది.. నా ముందే మెరిసింది ||2||
అందుకే.. అమాంతం నా మదీ.. అక్కడే.. నిశ్శబ్ధం అయినదీ
యెందుకో.. ప్రపంచం అన్నది.. ఇక్కడే.. ఇలాగె నా..తో.. వుంది

నిజం గా కళ్ళతో వింత గా మంత్ర మేసింది
అదేదొ మాయలొ నన్నిలా ముంచి వేసింది ||2||

నవ్వులు వెండి బాణాలై నాటుకు పోతుంటే
చెంపలు కెంపు నాణాలై కాంతిని ఇస్తుంటే
చూపులు తేనె దారాలై అల్లుకు పొతుంటె
రూపం యేడు బారాలై ముందర నుంచుంటె
ఆ సోయ గాన్ని నే చూడ గానె
ఓ రాయి లాగ అయ్యాను నే నే
అడిగ పాదముని అడుగు వెయ్యమని..
కదల లేదు తెలుసా..

||నిజం గా||

వేకువ లోన ఆకాశం ఆమెను చేరిందీ
ఓ క్షణమైన అధరాల రంగుని ఇమ్మందీ
వేసవి పాపం చలి వేసి ఆమెను వేడిందీ
శ్వాసల లోన తలదాచి జాలిగ కూర్చుంది
ఆ అంద మంతా నా సొంత మైతే
అనందమైనా వందేళ్ళు నావే
కలల తాకిడి ని మనసు తాళదిక
వెతికి చూడు చెలిని

||నిజం గా ||