కుమారి
చిత్రం : అపరిచితుడు (2005)
సంగీతం : హ్యారిస్ జయరాజ్
సాహిత్యం : చంద్రబోస్
గానం : శంకర్ మహదేవన్,హరిణి
షంజానే తోనే తానీ నేనానో
అవ తుంబకతానే అంబి లంబానో
ఓ సుకుమారి ఓ శృంగారి నా అలంగారిణి /2/
ఓ సుకుమారి..................
ఓ సుకుమారి ఓ శృంగారి
ఏ కుమారి ఏ కుమారి ఏ కుమారి ఏ కుమారి
కుమారీ...నా ప్రేమే వెక్కిముక్కి బక్క సిక్కెనె
కుమారీ...నా గుండె గొప్పి రోప్పి కృంగుసున్నదే
కుమారీ...నా మాటల కడలీ మండే ఎండేనే /2/
నే ఓడిపోయాననుకుంటానే
నా ప్రేమను కాస్తా వాయిదా వే స్తినే
రఘుమారి సుకుమారీ నా మనసొక విరినడి విరులలో అలజడి
కుమారీ...నా ప్రేమే వెక్కిముక్కి బక్క సిక్కెనె
కుమారీ...నా గుండె గొప్పి రోప్పి కృంగుసున్నదే
కుమారీ...నా మాటల కడలీ మండే ఎండేనే
షంజానే తోనే తానీ నేనానో
అవ తుంబకతానే అంబి లంబానో /2/
తొలి ప్రేమ అంటే పెనుభారమా
ఇది కానువు రాని నిండు గర్భమా
ప్రేమ గుట్టు దాస్తే బరువోపలేకా ఊపిరి ఆగదా ఊర్వశి
ప్రేమని తెలిపి కాదని అంటే ప్రేమే సచ్చిపోదా ప్రేయసీ
ప్రేమలేఖతో అయినా మా మదిలో వున్నది పూర్తిగ సెప్పలేము కదే
నువ్వు కళ్ళు మూసుకుంటే ప్రేమను తెలిపే వేరొక మార్గం లేదే
కుమారీ...కుమారీ....ఆ ఆ ఆ ఆ
ప్రేమ భాషే రాని మూగ వాడినే
వాడి పోవుచున్నా ఇట చూడవా
దోసిలి నిండా పువ్వులు నిండీ గువ్వల కోసం ఎతికినా
పువ్వుల నొసగి పూజను సేసి కోరిక అడుగుట మరిసినా
ఆ దేవునికన్నా బలమగువాడు వేరొకడున్నాడులే
కళ్ళను చూసి వలపును తెలిపే ధైర్యం గలవాడతడే అతడే ఓ కుమారీ
కుమారీ...నా ప్రేమే వెక్కిముక్కి బక్క సిక్కెనె
కుమారీ...నా గుండె గొప్పి రోప్పి కృంగుసున్నదే
కుమారీ...నా మాటల కడలీ మండే ఎండేనే /2/
కుమారా ...నీ ప్రేమ వెక్కిముక్కి బక్క సిక్కెనా
కుమారా ...నీ గుండె గొప్పి రోప్పి కృంగుచున్నదా
కుమారా ...నీ మాటల కడలీ మండే ఎండేనా?
నే ఓడిపోయాననుకుంటానే
నా ప్రేమను కాస్తా వాయిదా వే స్తినే
రఘుమారి సుకుమారీ నా మనసొక విరినడి విరులలో అలజడి
షంజానే తోనే తానీ నేనానో
అవ తుంబకతానే అంబి లంబానో /2/