ఓ ప్రియా వసుంధర
సుప్రభాతం (1998)
సామవేదం షణ్ముఖశర్మ
వందేమాతరం శ్రీనివాస్
బాలు, చిత్ర
ఓ ప్రియా... వసుంధర
ప్రేమనే వరించిరా
ఓ ప్రియా మనోహరా
స్వాగతం స్వయంవరా
మనిషికన్న ముందర
మనసు చేసె తొందర
కనుల గడప దాటుతూ
స్వప్నమెదుట పడెనురా
కలలలోని కలికితార
చిలుకుతోంది కాంతిధార
ఓ ప్రియా వసుంధర
ఓ ప్రియా మనోహరా
అరవిరిసిన కన్నులే మీటుతున్నవి
అరమరికలు వద్దనీ చాటుతున్నవి
తెరమరుగులు ఇప్పుడే తొలగుతున్నవి
మన మనసుకి రెక్కలే తొడుగుతున్నవి
నా మిణుకు మిణుకు ఆశలే నిజం అయ్యేలా
నీ వెలుగు తగిలి లోకమే మారెనీవేళా
నీ చిలిపి కనుల గూటిలో నేనే వుండేలా
నా బ్రతుకు జతగ చేయగా
వచ్చా గోపాల
కౌగిళ్ళ సంకెళ్ళు వేయనా
నిన్ను శృంగార ఖైదీ గ చేయనా
ఈ శిక్ష చాలంటు చాటనా
ఒప్పుకుంటాను ఈ తీపి దండనా
అలకతీరి అసలు దారి
తెలిసి నడిచె రాకుమారి
రెపరెపమని రెప్పలే విప్పుకున్నవి
తపనల ఎద తాళమే తప్పుతున్నది
ఎపుడెపుడని ఆత్రమే అడుగుతున్నది
అపుడిపుడని వాయిదా వేయనన్నది
నా దొరకు దొరుతున్నది నాలో సింగారం
ఇక తరిగి కరుగుతున్నది ఇన్నాళ్ళ దూరం
ఈ కలికి కులుకు కదలికే కన్యాకుమారం
నా ఉడుకు దుడుకు గుండెలో మోగే అలారం
కృష్ణయ్య తీరున్న రాముడే
సిగ్గు విల్లెక్కు పెట్టాడు వీరుడు
కాలాలు కనిపెట్టి కాముడే
తన కనికట్టు చూపాడె ధీరుడే
ముంచుతున్న మంచు కరిగి
పొద్దుపొడుపు వెలుగు కాంతి
ఓ ప్రియా... వసుంధర
ప్రేమనే వరించిరా
ఓ ప్రియా మనోహరా
స్వాగతం స్వయంవరా
మనిషికన్న ముందర
మనసు చేసె తొందర
కనుల గడప దాటుతూ
స్వప్నమెదుట పడెనురా
కలలలోని కలికితార
చిలుకుతోంది కాంతిధార
సుప్రభాతం (1998)
సామవేదం షణ్ముఖశర్మ
వందేమాతరం శ్రీనివాస్
బాలు, చిత్ర
ఓ ప్రియా... వసుంధర
ప్రేమనే వరించిరా
ఓ ప్రియా మనోహరా
స్వాగతం స్వయంవరా
మనిషికన్న ముందర
మనసు చేసె తొందర
కనుల గడప దాటుతూ
స్వప్నమెదుట పడెనురా
కలలలోని కలికితార
చిలుకుతోంది కాంతిధార
ఓ ప్రియా వసుంధర
ఓ ప్రియా మనోహరా
అరవిరిసిన కన్నులే మీటుతున్నవి
అరమరికలు వద్దనీ చాటుతున్నవి
తెరమరుగులు ఇప్పుడే తొలగుతున్నవి
మన మనసుకి రెక్కలే తొడుగుతున్నవి
నా మిణుకు మిణుకు ఆశలే నిజం అయ్యేలా
నీ వెలుగు తగిలి లోకమే మారెనీవేళా
నీ చిలిపి కనుల గూటిలో నేనే వుండేలా
నా బ్రతుకు జతగ చేయగా
వచ్చా గోపాల
కౌగిళ్ళ సంకెళ్ళు వేయనా
నిన్ను శృంగార ఖైదీ గ చేయనా
ఈ శిక్ష చాలంటు చాటనా
ఒప్పుకుంటాను ఈ తీపి దండనా
అలకతీరి అసలు దారి
తెలిసి నడిచె రాకుమారి
రెపరెపమని రెప్పలే విప్పుకున్నవి
తపనల ఎద తాళమే తప్పుతున్నది
ఎపుడెపుడని ఆత్రమే అడుగుతున్నది
అపుడిపుడని వాయిదా వేయనన్నది
నా దొరకు దొరుతున్నది నాలో సింగారం
ఇక తరిగి కరుగుతున్నది ఇన్నాళ్ళ దూరం
ఈ కలికి కులుకు కదలికే కన్యాకుమారం
నా ఉడుకు దుడుకు గుండెలో మోగే అలారం
కృష్ణయ్య తీరున్న రాముడే
సిగ్గు విల్లెక్కు పెట్టాడు వీరుడు
కాలాలు కనిపెట్టి కాముడే
తన కనికట్టు చూపాడె ధీరుడే
ముంచుతున్న మంచు కరిగి
పొద్దుపొడుపు వెలుగు కాంతి
ఓ ప్రియా... వసుంధర
ప్రేమనే వరించిరా
ఓ ప్రియా మనోహరా
స్వాగతం స్వయంవరా
మనిషికన్న ముందర
మనసు చేసె తొందర
కనుల గడప దాటుతూ
స్వప్నమెదుట పడెనురా
కలలలోని కలికితార
చిలుకుతోంది కాంతిధార