కోవెల దీపం
మాంగల్య బంధం (1985)
రాజశ్రీ
ఇళయరాజా
జానకి
కోవెల దీపం కోరుకుంది ...
మోహన రాగం పాడుకుంది ..
కనులు కనులు కలిసి తాళం వేసెను..
మనసు మనసు తెలిసి గీతం రాసెను ..
కోవెల దీపం కోరుకుంది ...
మోహన రాగం పాడుకుంది..
నేను నువ్వు కలిసే వేళ ..
నిన్నా రేపు మరిచే వేళ ..
నేడే ఉండి ఏనాడైనా..
పాడాలందీ ఏ పాటైనా
నీవు దేవుడై ....
నేను ...జీవుడై ....
లీనం కాగా...
గానం కాగా ...
నాదం కాగా
వేదం కాగా
వున్నా నీకై దాహంగ
నాలో దాహం తీరేదాక ....
నీపై మోహం పండే దాక
నీతో ఉండీ
నీలో నిండి ఆడనా
తోడూ నీడై
తోడి రాగం పాడనా
వెదురై నేను వేచున్నాను
మురళిగ నన్ను మార్చన్నాను
పెదవికి చేర్చి
ఊపిరి పోసి
హృదయం తెరిచి
రాగం నేర్పి
ప్రభువు నీవుగా
దాసి నేనుగా
పాడే నాడు
ఆడే నాడు
రాధా గాథా
మళ్ళీ రాదా
నువ్వే కృష్ణుడు కారాదా?
కోవెల దీపం కోరుకుంది ...
మోహన రాగం పాడుకుంది ..
కనులు కనులు కలిసి తాళం వేసెను..
మనసు మనసు తెలిసి గీతం రాసెను ..
కోవెల దీపం కోరుకుంది ...
మోహన రాగం పాడుకుంది..