కల నిజమాయెగా

కల నిజమాయెగా
సంసారం (1950)
సుసర్ల దక్షిణామూర్తి
జిక్కి
సముద్రాల సీనియర్

కల నిజమాయెగా
కోరిక తీరెగా
సాటిలేని రీతిగా
మదినెంతో హాయిగా

ఓ...
కోయిల పాటే
మాటై తోచే
చిత్రము గాదా ప్రేమా
చిత్రము గాదా ప్రేమా

హృదయమునేదో కదుల్చు గాదా
తియ్యని బాధా ప్రేమా
హృదయమునేదో కదుల్చు గాదా
తియ్యని బాధా ప్రేమా

ఓ...
ఏమో తెలియని భావమదేమో
ఇంపుగ మెరసే నాలో
ఏమో తెలియని భావమదేమో
ఇంపుగ మెరసే నాలో

నిజమిది దాని విశేషమేదో
నా మది మైమరపించే
నిజమిది దాని విశేషమేదో
నా మది మైమరపించే

ఓ...
ప్రేమాలయమే  హృదయమె కాదా
సుందరనందన సీమా
ప్రేమాలయమే  హృదయమె కాదా
సుందరనందన సీమా

నేడో రేపో సుఖింతునుగా
ప్రేమ ఫలించును గాదా
నేడో రేపో సుఖింతునుగా
ప్రేమ ఫలించును గాదా

కల నిజమాయెగా
కోరిక తీరెగా
సాటిలేని రీతిగా
మదినెంతో హాయిగా