అనురాగానికి కనులే లేవని
చిత్రం : సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి (1960)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : ఆత్రేయ
గానం : సుశీల, జానకి
అనురాగానికి కనులే లేవని
ఆర్యులు అన్నారూ
అనురాగానికి కనులే లేవని
ఆర్యులు అన్నారూ
అన్నది నిజమేనన్నది
నీవు రుజువు చేసినావూ
అన్నది నిజమేనన్నది
నీవు రుజువు చేసినావూ
అనురాగానికి కనులే లేవని
ఆర్యులు అన్నారూ
వేషం చూసి మోసము పోవుట
అవివేకము అన్నారు
వేషం చూసి మోసము పోవుట
అవివేకము అన్నారు
తొలి చూపులనే వలపన్నది
మది కలిగేదన్నారు
తొలి చూపులనే వలపన్నది
మది కలిగేదన్నారు
అనురాగానికి కనులే లేవని
ఆర్యులు అన్నారూ
కన్నెను నేను
కపటము ఎరుగను
చలించితి వరించితి
కన్నెను నేను
కపటము ఎరుగను
చలించితి వరించితి
కాదని నేను అనలేను
నీ కరమును బట్టి విడలేను
కాదని నేను అనలేను
నీ కరమును బట్టి విడలేను
అనురాగానికి కనులే లేవని
ఆర్యులు అన్నారూ
మగవారల మాయల
ఎరుగను నేనూ
మగువల వలపే
తెలియదు నాకు
మగవారల మాయల
ఎరుగను నేనూ
మగువల వలపే
తెలియదు నాకు
తెలియనిదిపుడే తెలిసితిమి
తెలిసినయటులే కలిసితిమి
తెలియనిదిపుడే తెలిసితిమి
తెలిసినయటులే కలిసితిమి
అనురాగానికి కనులే లేవని
ఆర్యులు అన్నారూ
అనురాగానికి కనులే లేవని
ఆర్యులు అన్నారూ
ఆర్యులు అన్నారూ