December 23, 2019

పూర్వజన్మ సంగమం

పూర్వజన్మ సంగమం
చిత్రం : మల్లెమొగ్గలు  (1986)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, జానకి

పూర్వజన్మ సంగమం
అపూర్వ ప్రేమసంగమం
పూర్వజన్మ సంగమం
అపూర్వ ప్రేమసంగమం
ఆ....
కలకానిది కడలేనిది
కడలీ నది కలిపే నిధి
నీలో నాలో పొరలి పొంగు
పూర్వజన్మ సంగమం
అపూర్వ ప్రేమ సంగమం
పూర్వజన్మ సంగమం
అపూర్వ ప్రేమ సంగమం

చరణం 1:

గంగను సురగంగను శివగంగను చేసిన కాశీక్షేత్రమూ...
గంగను సురగంగను శివగంగను చేసిన కాశీక్షేత్రమూ...
నా ఒడిలో కౌగిలిలో ఉన్నది నేనున్నది నీకోసమూ
బ్రతుకులాగ ముగిసిపోదు
వయసులాగ వెలిసిపోదు
బ్రతుకులాగ ముగిసిపోదు
వయసులాగ వెలిసిపోదు
దేనికీ ఓడిపోదు
నీవే నేనై పొంగే ప్రేమ

చరణం 2:

రాధను ఒక రాధను ప్రియగాధను చేసిన యమునాతీరమూ
రాధను ఒక రాధను ప్రియగాధను చేసిన యమునాతీరమూ
నా మదిలో ఒంటరిగా ఉన్నది నేనున్నది నీకోసమూ
గ్రహణాలకు తరిగిపోదు
మరణాలకు మలిగిపోదు
గ్రహణాలకు తరిగిపోదు
మరణాలకు మలిగిపోదు
గాలికి ఆరిపోని
జ్యోతే నాలో వెలిగే ప్రేమ

పూర్వజన్మ సంగమం
అపూర్వ ప్రేమసంగమం
పూర్వజన్మ సంగమం
అపూర్వ ప్రేమసంగమం
ఆ....
కలకానిది కడలేనిది
కడలీ నది కలిపే నిధి
నీలో నాలో పొరలి పొంగు
పూర్వజన్మ సంగమం
అపూర్వ ప్రేమ సంగమం
పూర్వజన్మ సంగమం
అపూర్వ ప్రేమ సంగమం