Showing posts with label మల్లెమొగ్గలు (1986). Show all posts
Showing posts with label మల్లెమొగ్గలు (1986). Show all posts

మందారమల్లికి శృంగార పూజలు


మందారమల్లికి శృంగార పూజలు
చిత్రం :  మల్లెమొగ్గలు  (1986)
సంగీతం :  రమేశ్ నాయుడు
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు, జానకి

పల్లవి :

మందారమల్లికి శృంగార పూజలు..
ఎన్నెల్ల తల్లికి ఏకాంత సేవలు
ఆ..ఆ...ఆ..ఆ..
మందారమల్లికి శృంగార పూజలు.. 
ఎన్నెల్ల తల్లికి ఏకాంత సేవలు

నా కళ్ళల్లో  నీ తొలి కాపురాలు.. 
కౌగిళ్లల్లో నీ రాణివాసాలు

మనసైన స్వామికి మందార మాలలు.. 
మరుమల్లె వేళకి సిరిమల్లె డోళలు
ఆ..ఆ..ఆ...ఆ...ఆ..
మనసైనా స్వామికి మందార మాలలు.. 
మరుమల్లె వేళకి సిరిమల్లె డోళలు
నా కళ్ళతోనే నీరాజనాలు .. 
కౌగిళ్లతోనే పూలహారాలు 

చరణం 1 :

పుప్పొడి నలుగులు పెట్టనా.. 
పుత్తడి జిలుగులు చూడనా
పుప్పొడి నలుగులు పెట్టనా.. 
పుత్తడి జిలుగులు చూడనా
గంగా యమునా సరస్వతులతో.. 
కృష్ణవేణినీ జడలల్లనా

వెన్నెల కలువల మెత్తమరించి
వెన్నెల కలువల మెత్తమరించి... 
కిన్నెరవీణలు మీటనా 
పస.. పస...
ససరి..ససరి
సరిగమపరిస
పస.. పస...
ససరి..ససరి
సరిగమపరిస

మనసైన స్వామీకి మందార మాలలు.. 
మరుమల్లె వేళకి సిరిమల్లె డోళలు

చరణం 2 :

పిల్లనగ్రోవిని ఊదనా.. 
పిల్లని గోపిక చేయనా
పిల్లనగ్రోవిని ఊదనా.. 
పిల్లని గోపిక చేయనా
వచ్చీరానీ అష్టపదులతో... 
రాసలీలలే ఆడేయ్యనా

కన్నులవలపులు కౌగిలికిచ్చి...
కన్నులవలపులు కౌగిలికిచ్చి...
వెన్నెల తలుపులు వేయనా...

పస.. పస...
ససరి..ససరి
సరిగమపరిస

పస.. పస...
ససరి..ససరి
సరిగమపరిస

మందారమల్లికి శృంగార పూజలు.. 
ఎన్నెల్ల తల్లికి ఏకాంత సేవలు
నా కళ్ళల్లో  నీ తొలి కాపురాలు.. 
కౌగిళ్లల్లో  నీ రాణివాసాలు

మనసైనా స్వామికి మందార మాలలు.. 
మరుమల్లె వేళకి సిరిమల్లె డోళలు
నా కళ్ళతోనే నీరాజనాలు .. 
కౌగిళ్లతోనే పూలహారాలు

మందారమల్లికి శృంగార పూజలు.. 
ఎన్నెల్ల తల్లికి ఏకాంత సేవలు

ఏరుపక్క..మావూరమ్మ

ఏరుపక్క..మావూరమ్మ
మల్లెమొగ్గలు (1986)
సంగీతం::రమేష్‌నాయుడు
రచన::వేటూరి సుందరరామ్మూర్తి
గానం::బాలు

పల్లవి::

ఆఆఆఆఆ..ఆఆఆఅ..ఆఆఅ ఆ
అ ఆ ఆ ఆ ఆ ఆఆఆఆ..ఆ ఆ ఆ అ

ఏరుపక్క..మావూరమ్మ
ఊరుపక్క..మాగాణమ్మ
ఏరుపక్క..మావూరమ్మ
ఊరుపక్క..మాగాణమ్మ

ఏరు కాళింది..ఊరు వ్రేపల్లె
ఏరు కాళింది..ఊరు వ్రేపల్లె
వేణువందుకే..ఏఏఏ..మోగిందమ్మ
వెన్నదాచకే..కన్నె గోపెమ్మ
వెన్నదాచకే..కన్నె గోపెమ్మ

ఏరుపక్క..మావూరమ్మ
ఊరుపక్క..మాగాణమ్మ

చరణం::1

మువ్వగోపాలా..రారా అంటూ
మువ్వగోపాలా..రారా అంటూ
మువ్వ మువ్వ..కీ..ఈ..పిలుపేనమ్మ
ముద్దు గోవిందా..ఆ..రా రమ్మంటూ
ముగ్గు ముగ్గునా..ఆఆ..కవితేనమ్మ
జారు పైటలా..ఆఆ..జావళి వింటే
జాను తెనుగులే..ఏఏఏ..పండేనమ్మ
జాను తెనుగులే..ఏఏఏ..పండేనమ్మ

ఏరుపక్క మావూరమ్మ
ఊరుపక్క మాగాణమ్మ

ఏరుపక్క మావూరమ్మ
ఊరుపక్క మాగాణమ్మ

చరణం::2

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
సువ్వి గోపాలా..సువ్వి అంటూ
సువ్వి గోపాలా..సువ్వి అంటూ
పాలపొంగులే..ఏఏఏ..పలికేనమ్మ
గుమ్మడెక్కడే..ఏఏఏ,,గుమ్మాఅంటూ
చల్ల చిందులే..ఏఏఏ..సణిగేనమ్మ
కొమ్మ కొమ్మకీ..ఈఈఈ..కొత్త పల్లవి
కోకిలమ్మలే..ఏఏఏ..పాడేనమ్మ
కోకిలమ్మలే..ఏఏఏ..పాడేనమ్మ

ఏరుపక్క మావూరమ్మ
ఊరుపక్క మాగాణమ్మ

ఏరుపక్క..మావూరమ్మ
ఊరుపక్క..మాగాణమ్మ

ఏరు కాళింది..ఊరు వ్రేపల్లె
ఏరు కాళింది..ఊరు వ్రేపల్లె
వేణువందుకే..ఏఏఏ..మోగిందమ్మ
వెన్నదాచకే..కన్నె గోపెమ్మ
వెన్నదాచకే..కన్నె గోపెమ్మ

ఏరుపక్క..మావూరమ్మ
ఊరుపక్క..మాగాణమ్మ

పూర్వజన్మ సంగమం

పూర్వజన్మ సంగమం
చిత్రం : మల్లెమొగ్గలు  (1986)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, జానకి

పూర్వజన్మ సంగమం
అపూర్వ ప్రేమసంగమం
పూర్వజన్మ సంగమం
అపూర్వ ప్రేమసంగమం
ఆ....
కలకానిది కడలేనిది
కడలీ నది కలిపే నిధి
నీలో నాలో పొరలి పొంగు
పూర్వజన్మ సంగమం
అపూర్వ ప్రేమ సంగమం
పూర్వజన్మ సంగమం
అపూర్వ ప్రేమ సంగమం

చరణం 1:

గంగను సురగంగను శివగంగను చేసిన కాశీక్షేత్రమూ...
గంగను సురగంగను శివగంగను చేసిన కాశీక్షేత్రమూ...
నా ఒడిలో కౌగిలిలో ఉన్నది నేనున్నది నీకోసమూ
బ్రతుకులాగ ముగిసిపోదు
వయసులాగ వెలిసిపోదు
బ్రతుకులాగ ముగిసిపోదు
వయసులాగ వెలిసిపోదు
దేనికీ ఓడిపోదు
నీవే నేనై పొంగే ప్రేమ

చరణం 2:

రాధను ఒక రాధను ప్రియగాధను చేసిన యమునాతీరమూ
రాధను ఒక రాధను ప్రియగాధను చేసిన యమునాతీరమూ
నా మదిలో ఒంటరిగా ఉన్నది నేనున్నది నీకోసమూ
గ్రహణాలకు తరిగిపోదు
మరణాలకు మలిగిపోదు
గ్రహణాలకు తరిగిపోదు
మరణాలకు మలిగిపోదు
గాలికి ఆరిపోని
జ్యోతే నాలో వెలిగే ప్రేమ

పూర్వజన్మ సంగమం
అపూర్వ ప్రేమసంగమం
పూర్వజన్మ సంగమం
అపూర్వ ప్రేమసంగమం
ఆ....
కలకానిది కడలేనిది
కడలీ నది కలిపే నిధి
నీలో నాలో పొరలి పొంగు
పూర్వజన్మ సంగమం
అపూర్వ ప్రేమ సంగమం
పూర్వజన్మ సంగమం
అపూర్వ ప్రేమ సంగమం