నువ్వెవరయ్యా... నేనెవరయ్యా
చక్రధారి (1977)
సంగీతం: జీ.కే.వెంకటేష్
రచన: ఆచార్య ఆత్రేయ
గానం: రామకృష్ణ
పల్లవి::
విఠలా.... పాండురంగ విఠలా
నువ్వెవరయ్యా.... నేనెవరయ్యా
నువ్వెవరయ్యా.... నేనెవరయ్యా
నువ్వూ నేనూ ఒకటేనయ్య
విఠలా....
నువ్వేనేనని నేనేనువ్వని
నమ్మినవాడిని నేనయ్యా
నువ్వెవరయ్యా... నేనెవరయ్యా
నువ్వూ నేనూ ఒకటేనయ్య
చరణం::1
జీవనమునకై మట్టికుండలను
చేసి అమ్ముకుంటూ కుమ్మరి నేను
జీవనమునకై మట్టికుండలను
చేసి అమ్ముకుంటూ కుమ్మరి నేను
జీవం పోసిన బొమ్మలు చేసే
జీవం పోసిన బొమ్మలు చేసే
బ్రహ్మను చేసిన కుమ్మరి నీవు
బ్రహ్మను చేసిన కుమ్మరి నీవూ
విఠలా.... పాండురంగ విఠలా
జయజయ విఠలా....
విఠలా...విఠలా విఠలా
చరణం::2
త్యాగాలెరుగను యోగాలెరుగను
రాగభోగముల రక్తిని కోరను
త్యాగాలెరుగను యోగాలెరుగను
రాగభోగముల రక్తిని కోరను
అనురక్తితో నీ నామామృతమును
అనురక్తితో నీ నామామృతమును
ఆస్వాదించే సాధన చాలును
ఆస్వాదించే సాధన చాలూ
పుండరీకవరదా జయపాండురంగ
పాండురంగ విఠలా జయపాండురంగ
విఠలా.....
పుండరీకవరదా... జయపాండురంగ
పాండురంగ విఠలా...