మానవా...! ఏమున్నది
చక్రధారి (1977)
రామకృష్ణ
జీ.కే.వెంకటేష్
పరమహంసను గాను పండితుడను గాను
హరి కీర్తనము తప్ప వేరేది ఎఱుగను
వేరేది ఎఱుగను
మానవా ఏమున్నది ఈ దేహం
ఇది రక్తమాంసముల అస్థిపంజరం
దీనిపై ఏలరా ఈ వ్యామోహం?
మానవా ఏమున్నది ఈ దేహం
మానవా... ఏమున్నది ఈ దేహం
నవమాసాలు కడుపునా చెరబడీ
నవరంధ్రాలతో భువిపై దిగబడి
నవనవలాడీ
జవజవలాడి
నశించే బొమ్మరా
ఈ నరజన్మ
మానవా ఏమున్నది ఈ దేహం
మానవా... ఏమున్నది ఈ దేహం
ఊపిరాడేవరకే నేనూ నాదను మమకారాలు
ఆపై వల్లకాటిలో ఉండవు ఏ తేడాలు
మట్టి మట్టిలో గాలి గాలిలో
మాయమౌ బొమ్మరా
ఈ నరజన్మ
మానవా ఏమున్నది ఈ దేహం
మానవా... ఏమున్నది ఈ దేహం
వచ్చేటప్పుడు నీతో తెచ్చేదేది లేదు
పోయేటప్పుడు తీసుకుపోయేదేదీ లేదు
ఈ రాకపోకలా చీకటిదారిలో
దివ్వెరా విఠలుని దివ్యనామం
మానవా ఏమున్నది ఈ దేహం
ఇది రక్తమాంసముల అస్థిపంజరం
దీనిపై ఏలరా ఈ వ్యామోహం?
మానవా ఏమున్నది ఈ దేహం
మానవా... ఏమున్నది ఈ దేహం