నా ప్రేమకే సెలవూ
చిత్రం: నీరాజనం (1988)
సంగీతం: ఓ.పి. నయ్యర్
గీతరచయిత: సినారె
నేపథ్యగానం: బాలు
పల్లవి:
హ్మ్.. ఊఁఊఁ...
హ్మ్.. ఊఁఊఁ...
నా ప్రేమకే సెలవూ..ఊ.. నా దారికే సెలవూ
కాలానికే సెలవూ..ఊ.. దైవానికే సెలవూ
ఈ శూన్యం నా గమ్యం ఈ జన్మకే..ఏ.. సెలవూ
నా ప్రేమకే సెలవూ..ఊ.. నా దారికే సెలవూ
కాలానికే సెలవూ..ఊ.. దైవానికే సెలవూ
చరణం 1:
మదిలోని రూపం మొదలంత చెరిపీ
మనసార ఏడ్చానులే..ఏ..
కనరాని గాయం కసితీర కుదిపీ
కడుపార నవ్వానులే..ఏ..
నా ప్రేమకే సెలవూ..ఊ.. నా దారికే సెలవూ
కాలానికే సెలవూ..ఊ.. దైవానికే సెలవూ
చరణం 2:
అనుకున్న దీవీ అది ఎండమావీ
ఆ నీరు జలతారులే..ఏ..
నా నీడ తానే నను వీడగానే
మిగిలింది కన్నీరులే..ఏ..
నా ప్రేమకే సెలవూ..ఊ.. నా దారికే సెలవూ
కాలానికే సెలవూ..ఊ.. దైవానికే సెలవూ
ఈ శూన్యం నా గమ్యం ఈ జన్మకే సెలవూ..ఊ..
నా ప్రేమకే సెలవూ నా దారికే సెలవూ
కాలానికే సెలవూ..ఊ.. దైవానికే సెలవూ