ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో
చిత్రం: నీరాజనం (1988)
సంగీతం: ఓ.పి. నయ్యర్
గీతరచయిత: మోపర్తి సీతారామారావు
నేపధ్య గానం: ఎం.ఎస్. రామారావు
పల్లవి:
ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో..ఓ..
నిదురించు జహాపనా
నిదురించు జహాపనా
ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో..ఓ..
నిదురించు జహాపనా
నిదురించు జహాపనా
చరణం 1:
పండు వెన్నెల్లో వెండీ కొండల్లే
తాజ్ మహల్ దవళా కాంతుల్లో..ఓ..
పండు వెన్నెల్లో వెండీ కొండల్లే
తాజ్ మహల్ దవళా కాంతుల్లో..ఓ..
నిదురించు జహాపనా
నిదురించు జహాపనా
ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో..ఓ..
నిదురించు జహాపనా
నిదురించు జహాపనా
చరణం 2:
నీ జీవిత..ఆ..జ్యోతీ.. నీ మధురమూర్తి
నీ జీవిత..ఆ..జ్యోతీ.. నీ మధురమూర్తి
ముంతాజ సతి సమాధీ సమీపాన నిదురించు
ముంతాజ సతి సమాధీ సమీపాన నిదురించు జహాపనా
ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో..ఓ..
నిదురించు జహాపనా
నిదురించు జహాపనా