వేమూరి గగ్గయ్య పద్యాలు – శిశుపాలుడిపాత్ర


వేమూరి గగ్గయ్య గారు పాడిన పద్యాలు – శిశుపాలుడిపాత్ర – 1936 – ద్రౌపది వస్త్రాపహరణము

వారిధులఁ గలంతు, సురవర్గము త్రుళ్ళడిగింతు,
నాద్యహీంద్రోరుఫణాగ్ర సంస్థితమహోగ్రమణిన్ బెకలింతు
లోక కంఠీరవ నామకారికులు నిస్తుల తేజములఁ హరింతు
కంసారి యనంగ నెంత ప్రళయాంతకుడై నుఱుమాడకుండునే

కులమా, గోత్రమా, యూరా, పేరా సభలో కూర్చుండగా నర్హుడా?
కలదా విద్యయు పౌరుషంబుఁ? గుణవిఖ్యాతుండా? ధర్మాత్ముడా?
తలయున్, గడ్డము పండినట్టి వయసా?
త్రాష్టుండు గోపాలు నే ఫలమాసించి తో పూజసేయుటకు సంపద్గర్వమా ధర్మజా!